Home » అప్పులు తీర్చేందుకు కృష్ణ ద‌గ్గ‌ర కొనుగోలు చేసిన భూమిని అమ్మేసిన చిరు….! ఆ ప‌రిస్థితులు ఎందుకు వ‌చ్చాయి..?

అప్పులు తీర్చేందుకు కృష్ణ ద‌గ్గ‌ర కొనుగోలు చేసిన భూమిని అమ్మేసిన చిరు….! ఆ ప‌రిస్థితులు ఎందుకు వ‌చ్చాయి..?

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమకే చిరంజీవి పెద్దగా వ్యవహరించాలని చాలా మంది కార్మికులు, నటీనటులు కోరుకుంటున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి వచ్చిన చిరంజీవి ప్రస్తుతం చిత్ర పరిశ్రమకే పెద్దదిక్కుగా మారిపోయారంటే ఆయ‌న స్థాయి స్థానం అర్థం చేసుకోవ‌చ్చు. అంతేకాకుండా చిరంజీవి వేలకోట్ల ఆస్తులను సంపాదించుకున్నారు.

Advertisement

కేవలం సినిమాల ద్వారానే కాకుండా ఇతర వ్యాపారాల ద్వారా కూడా చిరంజీవి ఆస్తులను సంపాదించారు. అయితే ఒకానొక సమయంలో మాత్రం చిరంజీవి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే పార్టీ నిర్మాణం కోసం చిరంజీవి చాలా డ‌బ్బులు ఖ‌ర్చు చేశార‌ట‌. పార్టీని స్థాపించ‌డం రాష్ట్ర‌వ్యాప్తంగా దానిని బ‌లోపేతం చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు.

Advertisement

దాంతో ఆయ‌న అప్పులు సైతం చేయాల్సి వ‌చ్చింద‌ట‌. ఇక చేసిన అప్పుల‌ను తీర్చ‌డానికి చిరు తనకు చెన్నైలో ఉన్న ఎకరం భూమిని 25 కోట్లకు అమ్మేశారట. మొదట ఫిల్మ్ ఇండస్ట్రీ చెన్నైలో ఉండేది. అప్పుడు స్టూడియోలు కూడా అక్కడే నిర్మించుకునేవారు. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ కృష్ణకు అక్కడ ఐదు ఎకరాల్లో కృష్ణ గార్డెన్స్ పేరుతో ఓ స్టూడియో ఉండేదట.

అయితే అందులో చిరంజీవి సైతం ఒక ఎకరంను కొనుగోలు చేశారు. కానీ ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత పార్టీ నిర్మాణం కోసం ఆయయ ఆ ఎక‌రం స్థలాన్ని అమ్ముకోవాల్సిన ప‌రిస్థితులు వ‌చ్చాయి. అలా వ‌చ్చిన డ‌బ్బుల‌తోనే అప్పును తీర్చుకున్నార‌ట‌. ఇక‌ ఈ విషయాన్ని చిరంజీవి సన్నిహితుడు ఎన్ వి ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Visitors Are Also Reading