Home » చిరంజీవి డ్యాన్స్ గురించి ఎన్టీఆర్ జపాన్ లో ఏం చెప్పారో తెలుసా ?

చిరంజీవి డ్యాన్స్ గురించి ఎన్టీఆర్ జపాన్ లో ఏం చెప్పారో తెలుసా ?

by Anji
Ad

సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న కొన్ని కుటుంబాల మధ్య ఇంటర్నల్ గా గొడవలు ఉన్నాయని వార్తలు వస్తుండటం సహజం. అలాగే మెగా, నందమూరి ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా హార్ట్ ఇష్యూస్ అయ్యాయి. తాజాగా చిరంజీవిపై ఎన్టీఆర్ చేసిన ఓ కామెంట్ తో అందరిలో ఓ క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం రాజమౌళి ఫ్యామిలీ,ఎన్టీఆర్, రామ్ చరణ్ అంతా కూడా జపాన్ లో సందడి చేస్తున్న సంగతి మనందరికీ తెలసిందే. RRR చిత్రాన్ని జపాన్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేసి భారీ ఓపెనింగ్స్ అందుకున్న సందర్భంగా అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఓ ఇంటర్వ్యూలో భాగంగా చిరంజీవిపై ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. చిరంజీవిపై ఉన్న అభిమానం మొత్తం బయటపడేలా ఎన్టీఆర్ మాట్లాడారు. ముఖ్యంగా చిరంజీవి డ్యాన్స్ గురించి చాలా గొప్పగా చెప్పారు ఎన్టీఆర్.

Advertisement

ఇండియాలో బెస్ట్ డాన్సర్, యాక్టర్ ఎవరు అని అక్కడి మీడియా ప్రశ్నించడంతో రామ్ చరణ్ ఫాదర్ చిరంజీవి అంటూ ఒక్కమాటలో చెప్పేశారు ఎన్టీఆర్. చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అని, ఇండియాలో ది బెస్ట్ డాన్సర్ మెగా అభిమానుల్లో జోష్ నింపారు. RRR సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య మంచి దోస్తీ కుదిరింది. వాస్తవానికి అంతకుముందు నుంచే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పటికీ RRR మూవీ ఆ బంధాన్ని మరింత బలపరిచింది. ప్రస్తుతం టాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటూ మెగా, నందమూరి అభిమానులను ఖుషి చేస్తున్నారు ఈ ఇద్దరు యంగ్ హీరోస్.

Advertisement

Also Read :   పూరి జగన్నాథ్ మంచి మోసగాడే.. సోషల్ మీడియాలో అభిమాని లెటర్ వైరల్..!


తాజాగా రామ్ చరణ్ నాన్న చిరంజీవిపై ఎన్టీఆర్ ఇలా ప్రశంసలు గుప్పించడం ఇరువురి ఫ్యాన్స్ లో సంబరాలు నింపాయి. దీంతో మెగా, నందమూరి కుటుంబాల మధ్య ఇంచు కూడా క్లాష్ లేదని ఓ నిర్ధారణకైతే వచ్చేశారు. RRR సినిమా దేశవిదేశాల్లో రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జపాన్ లో రిలీజ్ చేయడంతో అక్కడ కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా విడుదలకు ముందు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి ముగ్గురు కూడా ప్రమోషన్ కోసం పెట్టిన ఎఫర్ట్స్ చాలా సక్సెస్ అయ్యాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది RRR. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కనబరిచిన పోటాపోటీ అభినయం టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసింది. తద్వారా నిర్మాతలకు కాసుల వర్షం కురిసింది.

Also Read :  సోష‌ల్ మీడియా లో ప్రెగ్నెన్సీ కిట్ షేర్ చేసిన నిత్యామీన‌న్‌.. అస‌లు విష‌యం ఏంటంటే ?

 

Visitors Are Also Reading