Home » చిరంజీవి కారు కొనుకుందామంటే ఎన్టీఆర్ వద్దు అన్నారు.. ఎందుకో తెలుసా ?

చిరంజీవి కారు కొనుకుందామంటే ఎన్టీఆర్ వద్దు అన్నారు.. ఎందుకో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

మెగాస్టార్ చిరంజీవికి-ఎన్టీఆర్ కి చాలా అవినావ భావ సంబంధం ఉండేది. చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే నిత్యం ఎన్టీఆర్ ని కలిసేవారట.  తాజాగా విశాఖలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య పురస్కారం, జీవన సాఫల్య  పురస్కారాల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Sr-NTR

Advertisement

 

అప్పట్లో ఎన్టీఆర్  ఓ మాట అన్నారు. బ్రదర్ మీరు బాగా అభివృద్ధి లోకి వస్తున్నారు. సంపాదించిన సంపద అంతా ఇనుప ముక్కల మీద పెట్టొద్దు. ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి. ఆ తరువాత స్థలం మీద పెట్టండి. మనల్ని కాపాడేది అదే. మనం ఎక్కువ కాలం ఇలాగే ఉండం.. సూపర్ స్టార్ లాగా ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. ఎంతో జాగ్రత్తతో ముందస్తు చూపుతో ఆయన ఇచ్చిన సలహా అంతా ఇంతా కాదు. అప్పటి వరకు కారు కొందామా ఎవరో చెప్పినట్టుగా టయోటా తలుపులు పైకి తెరుచుకుంటాయి.. అప్పట్లో అది చాలా ఫ్యాన్సీ.. అలాంటి కార్లు కొనుకుందామా..? అనుకునే నేను.. ఆపేసి అక్కడక్కడ స్థలాలు కొనడం మొదలు పెట్టాను. ఈరోజున నా రెమ్యునరేషన్ కంటే కూడా ఆ స్థలాలే నన్ను.. నా ఫ్యామిలీని కాపాడుతున్నాయి. అలాంటి గొప్ప సలహాలు ఇచ్చినటువంటి మహానుభావులు దూర దృష్టితో రామారావు గారితో తాను చేసిన సినిమా  తిరుగులేని మనిషి.

Advertisement

ఈ సినిమాలో రామారావు నేను కలిసి కిందికి దూకే సీన్ ఉంది.. ఆ సినిమా చేస్తున్న సమయంలో నేను దూకేశాను.. కానీ ఎన్టీఆర్ అలా దూకకూడదు అని చెప్పారు. ఆర్టిస్ట్ చాలా విలువైన జీవితం.. అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే.. సినిమాకు  చాలా నష్టం కలుగుతుంది. సంఘర్షణ సినిమా షూటింగ్ జరిగిన సమయంలో విలన్ తన్నే క్రమంలో కాలు బెనికింది. చాలా ఇబ్బంది పడ్డాను. దాదాపు 6 నెలల వరకు షూటింగ్ కి హాజరు కాలేదు. అందుకే మనం పెద్దల మాట వినాలి. చాలా దూర దృష్టితో ఎన్టీఆర్ గారు సూచనలు ఇచ్చారని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading