Home » ఆర్ఆర్ఆర్ నుండి బిగ్ అప్డేట్….ఎన్టీఆర్ భీం పోస్ట‌ర్ విడుద‌ల‌…!

ఆర్ఆర్ఆర్ నుండి బిగ్ అప్డేట్….ఎన్టీఆర్ భీం పోస్ట‌ర్ విడుద‌ల‌…!

by AJAY
Ad

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ మ‌రియు రామ్ చ‌ర‌ణ్ లు హీరోలుగా న‌టిస్తున్నారు. రాజ‌మౌళి ఈసినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అంతే కాకుండా సినిమాలో చ‌ర‌ణ్ కు జోడిగా అలియా భ‌ట్ న‌టిస్తోంది. ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ న‌టిస్తోంది. సినిమాలో ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ్ గ‌న్ కూడా సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Advertisement

ntr bheem poster

ntr bheem poster

 

అయితే ఇప్ప‌టికే ఈ సినిమా నుండి ప‌లు అప్డేట్ లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. టీజ‌ర్ లు మ‌రియు గ్లింప్స్ లు విడుద‌ల చేయ‌గా భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా తాజాగా ఆర్ఆర్ఆర్ యూనిట్ తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించిన‌ మ‌రోపోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది. ఇక ఈ పోస్ట‌ర్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ఎన్టీఆర్ భీమ్ పోస్ట‌ర్ రావ‌డంతో అభిమానులు ట్విట్ట‌ర్ ట్రెండింగ్ లోకి తీసుకువ‌చ్చారు. ఇదిలా ఉండ‌గా ఈ రోజు సాయంత్రం 4గంట‌ల‌కు రాంచ‌ర‌ణ్ పోస్ట‌ర్ ను కూడా విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

Advertisement

Also Read: 15 నిమిషాల కోసం 5 కోట్ల రెమ్యున‌రేష‌నా?

Visitors Are Also Reading