యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలు గా తెరకెక్కుతున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించారు. సినిమాలో ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఇక సినిమాలో చరణ్ కు జోడీగా అలియా భట్ నటిస్తుండగా….ఎన్టీఆర్ కు జోడిగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ నటిస్తోంది. ఇక ఈ సినిమాను జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement
RRR trailer release date
ఇక ఇప్పటికే విడుదల చేసిన టీజర్ మరియు పాటలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా ట్రైలర్ తేదీని ఖరారు చేసింది. డిసెంబర్ 9న ఉదయం 10 గంటలకు థియేటర్లలో సినిమా ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ రామ్ చరణ్ పరిగెత్తుతున్న మరో పోస్టర్ ను విడుదల చేసింది. ఇక ఎన్నో అంచనాల మధ్య విడుదల అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఏమేరకు అలరిస్తుందో చూడాలి.
Advertisement