నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు వీరిద్దరూ తెలుగు ఇండస్ట్రీకి రెండు కండ్లలాంటి వారు అని చెబుతుంటారు. ఇరువురి కుటుంబాలు చాలా కాలం వరకు కలిసే ఉన్నాయి. ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకునేవారు. ఇలా కలిసి మెలిసి ఉన్న వీరిద్దరి మధ్య అనుకోకుండా కొన్నిసార్లు గొడవలు తలెత్తాయట. దాదాపు ఆరేళ్ల వరకు ఒకరి మొహం ఒకరు చూసుకోకుండా ఉన్నారట. ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు ప్రస్తుతం ఉన్న ఏపీ తమిళనాడులో కలిసి ఉంది. అప్పుడు సినీ ఇండస్ట్రీ చెన్నయ్‌లోనే ఉంది. చెన్నయ్ అభివృద్ధి చెందినంతగా హైదరాబాద్ అభివృద్ధి చెందలేదు. అప్పుడు హైదరాబాద్ నిజాం పాలన నుంచి బయటపడి కొత్త రాష్ట్రంగా అవతరించింది. ఇక్కడ అన్ని సదుపాయాలు ఇంకా రాలేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్స్ అంతా చెన్నయ్‌లోనే షూటింగ్ చేసేవారు. ఏఎన్నార్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉండేవారు. గుమ్మడి వెంకటేశ్వరరావు తన పుస్తకం తీపి గుర్తులు చేదు జ్ఞాపకాలు లో ఎన్టీఆర్-ఏఎన్నార్ మధ్య గొడవలు ఎందుకు జరిగాయో వివరించారు. వీరు కృష్ణా జిల్లా నుంచి మద్రాస్‌కి వెళ్లి సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు.
Advertisement
Also Read : గాడ్ ఫాదర్ లో పూరి జగన్నాథ్ నటించాడని చెప్పిన చిరు..!
ఎన్టీఆర్ పౌరాణికం, జానపద చిత్రాల్లో.. అక్కినేని సాంఘిక చిత్రాల్లో ఎక్కువగా నటించేవారు. 1960లో అక్కినేని హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఆయన సినిమా షూటింగ్స్ కూడా హైదరాబాద్‌లోనే చేసేవారు. ఎన్టీఆర్ మాత్రం మద్రాస్‌లోనే చేసేవారు. ఎన్టీఆర్ తన వాళ్లను వదిలి హైదరాబాద్ రావడానికి ఇష్టపడలేదు. దీంతో వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. ఈ సమయంలో దాదాపు ఆరేళ్ల వరకు వీరు మాట్లాడుకోలేదట. వీరి అభిమానుల మధ్య కూడా దూరం పెరిగింది. కొంత కాలం తరుఆవత ఎన్టీఆర్ కూడా హైదరాబాద్ వచ్చి ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేశారట. ఇక వీరిరువురి మధ్య మాటలు కలిసి సినిమాలు చేశారని గుమ్మడి తన పుస్తకంలో రాసుకొచ్చారు.
Also Read : సౌత్ ను నమ్ముకోవడం షారుఖ్ కు కలిసొస్తుందా..?