పేరు జార్వో నంబర్ 69. ఈ రెండింటి కాంబినేషన్ అంటే ప్రతి ఒక్కరికి ఈ క్రేజీ పర్సన్ గుర్తువస్తాడు. అతను మరోసారి వచ్చేసాడు. ఈసారి ఏకంగా వరల్డ్ కప్ లో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య చెన్నైలో మ్యాచ్ జరుగుతుంది. అక్కడ ఈ జార్వో ప్రత్యక్షమయ్యాడు. పోలీసుల నుంచి ఎలాగో తప్పించుకొని ఇండియన్ జెర్సీ వేసుకోని నేరుగా పిచ్ మీదకు వచ్చేసాడు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని పట్టుకున్నారు.
ఈ లోగా మన వికెట్ కీపర్ కే ఎల్ రాహుల్ మర్యాదగా వెళ్లిపోవాలంటూ దారి చూపించాడు. సిబ్బంది వచ్చే జార్వోను తీసుకెళ్తుండగా విరాట్ కోహ్లీ తన పొజిషన్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి జార్వోకు ఏదో చెప్పాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే ఐసీసీ స్పందించింది. జార్వో వేరే వరల్డ్ కప్ స్టేడియంకి కూడా హాజరుకాకుండా బ్యాన్ విధించింది. ఈ జార్వో గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందేగా. 2021లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన సమయంలో మూడుసార్లు ఇలాగే పిచ్ మీదకు వచ్చాడు.
Advertisement
Advertisement
ఓసారి ఫీల్డింగు కోసం, మరోసారి బౌలింగ్ వేయడానికి అన్నట్టు ఇక అన్నింటికంటే హైలైట్ ఏంటంటే ఓసారి వికెట్ పడ్డాక విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు దిగాల్సి ఉంటే ఈ జార్వో ఒక్కసారిగా బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లోకి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ విరాట్ కోహ్లీ జార్వోతో ఏదో మాట్లాడటంతో ఆ రెండు ఘటనలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. జార్వో చేసే ఇలాంటి చేష్టల వల్లే ఇంగ్లాండ్లో కొన్ని స్టేడియాల్లో అతనిపై నిషేధం ఉంది. ఇక ఇప్పుడు జీవితంలో ఏ వరల్డ్ కప్ మ్యాచ్లు చూడలేడు అన్నమాట.
ఇవి కూడా చదవండి
- World Cup 2023 : రాహుల్ సెంచరీ మిస్.. పాండ్యా స్టైలీష్ అంటూ విమర్శలు
- కొడుకులు పుట్టాలంటే ఇలా చేస్తే సరిపోతుంది…3వది చాలా ముఖ్యం?
- లాయర్ పాత్రలో నటించి మెప్పించిన హీరోయిన్లు !