Home » World Cup 2023 : రాహుల్ సెంచరీ మిస్.. పాండ్యా సెల్ఫిష్ అంటూ విమర్శలు

World Cup 2023 : రాహుల్ సెంచరీ మిస్.. పాండ్యా సెల్ఫిష్ అంటూ విమర్శలు

by Bunty
Ad

మొన్న వరల్డ్‌ కప్‌ లో భాగంగా ఇండియా వర్సెస్‌ ఆసీస్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే..195 పరుగుల వద్ద టీమ్ ఇండియా ఉంది. ఇంకో ఐదు పరుగులు చేస్తే టీమిండియా విజయం సాధిస్తుంది. ఆ సమయంలో రాహుల్ సిక్స్ కొట్టాడు. ఇంకేముంది మ్యాచ్ గెలిచింది కానీ రాహుల్ డిసప్పాయింట్ అయ్యాడు. ఎందుకంటే అతని స్కోర్ 97 పరుగుల వద్ద ఆగిపోవడం వల్ల.

Fans Slam Selfish Hardik Pandya For Not Letting KL Rahul Get To Hundred

Fans Slam Selfish Hardik Pandya For Not Letting KL Rahul Get To Hundred

అయితే రాహుల్ సెంచరీ కాకుండా అడ్డుకున్నది ఆస్ట్రేలియా బౌలర్ కాదట. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అట. ఈ మాట చెబుతుంది మరెవరో కాదు కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఎందుకంటే పాండ్యా క్రీజులోకి వచ్చిన సమయానికి టీం ఇండియా విజయం దాదాపు ఖాయమైపోయింది. రాహుల్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఈ సమయంలో అతడికి స్ట్రైక్ ఇవ్వాల్సింది పోయి పాండ్యా 39 ఓవర్లో సిక్స్ కొట్టడం ఏంటి అంటూ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

Advertisement

Advertisement

దానివల్ల సెంచరీ మిస్ అయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల జరిగిన వెస్టిండీస్ సిరీస్ లో కూడా నాన్ స్ట్రైక్ లో తిలక్ వర్మ 49 పరుగులతో ఉంటే అతనికి హాఫ్ సెంచరీ చేసుకోవడానికి స్ట్రైక్ ఇవ్వాల్సింది పోయి సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించాడు పాండ్యా. ఇప్పుడు ఈ రెండింటినీ కంపేర్ చేస్తూ వాట్ ఇస్ దిస్ పాండ్యా బ్రో అంటూ టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading