క్రికెట్ లో అప్పుడప్పుడు నేరుగా చేతుల్లోకి వచ్చే అత్యంత సులభమైన క్యాచ్‌లను కూడా కొన్ని సందర్భాల్లో వదిలేస్తుంటారు. అదే సమయంలో బౌండరీ లైన్ వద్ద అసాధ్యం అనుకున్న క్యాచ్‌ను చాకచక్యంగా అందుకుని ఫ్యాన్స్ చేత శభాష్ అనిపించుకున్నారు. తాజాగా క్రికెట్ చరిత్రలో మన ఊహకైనా అందనటువంటి క్యాచ్ ను ఓ ప్లేయర్ అందుకున్నాడు. విలేజ్ లీగ్ గేమ్‌లో భాగంగా.. ఆల్డ్ విక్ క్రికెట్ క్లబ్, లింగ్ ఫీల్డ్ క్రికెట్ క్లబ్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. లింగ్ ఫీల్డ్ క్లబ్ బ్యాటింగ్ సమయంలో 16 ఏళ్ల అలెక్స్ రైడర్ బౌలింగ్ కు వచ్చాడు. అతడు వేసిన బంతి భారీ షాట్ ఆడేందుకు బ్యాట్స్‌మెన్ ప్రయత్నించాడు. బ్యాట్ ఎడ్జ్‌కు తగిలిన బంతి అమాంతం గాలిలోకి లేచింది.
Advertisement
బంతి బౌలర్ తలపైనే గాల్లోకి లేవడంతో కాట్ అండ బౌల్ ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ అలెక్స్ ఈజీగా క్యాచ్‌ను అందుకుంటాడు అని ఎవ్వరూ ఊహించలేదు. బంతి అలెక్స్ చేతిలో పడి బౌన్స్ కాగా అలెక్స్ నేల మీద కిందపడ్డాడు. దీంతో క్యాచ్ డ్రాప్ అయిందని అనుకున్న తరుణంలో ఇక్కడ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. క్యాచ్ అందుకునే తరుణంలో అప్పటికే కిందపడిపోయిన రైడర్ కాలును పైకి లేపడం.. అదే సమయంలో బంతి అతని కాలుపై పడి మళ్లీ గాల్లోకి బౌన్స్ అవ్వడం అన్ని చకచక జరిగిపోయాయి.
ఈ సారి అలెక్స్ తప్పు చేయకుండానే క్యాచ్‌ను అందుకున్నాడు. అతను క్యాచ్ అందుకోవడాన్ని సహచర ప్లేయర్లతో పాటు ప్రత్యర్థి బ్యాటర్లు కూడా నోరెళ్లబెట్టి చూడడం విశేషం. పైనల్‌గా అలెక్స్ క్యాచ్ అందుకోవడం ఆ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు చేరడం అంతా చకచక జరిగింది. దీనికి సంబంధించినదంతా స్టంప్ కెమెరాలో రికార్డు కావడం మరొక విశేషం. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. కొందరూ నోబాల్ అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేసి.. సిల్లీ క్రికెట్ అని పేర్కొనడం విశేషం.
Also Read :
పళ్లు పుచ్చిపోవడం వల్ల నొప్పిగా ఉందా..? ఇలా చేస్తే వెంటనే తగ్గుతుందట..!
మీరు రాత్రిపూట ఖాళీ కడుపుతో నిద్రపోతున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవట..!