ఐపీఎల్ 2023 సీజన్ 47వ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. గెలవాల్సిన మ్యాచ్లో చేజేతుల ఓటమిపాలైంది. చివరి 5 ఓవర్లలో 38 పరుగులు చేయాల్సిన దశలో కేవలం 32 పరుగులు మాత్రమే ఓడిపోయింది. చివరి ఐదు ఓవర్లలో మూడు ఓవర్లను వేసిన వరుణ్ చక్రవర్తి తన 18 బంతుల్లో 8 పరుగులు మాత్రమే ఇచ్చి సన్రైజర్స్ ఓటమి రాత రాశాడు. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
READ ALSO : IPL 2023 : చేతులు కలిపిన కోహ్లీ, గంగూలీ.. వివాదం సద్దుమణిగినట్టేనా?
Advertisement
దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులకే పరిమితమైంది. కాగా, KKR కెప్టెన్ నితీష్ రానా భార్య సాచి మార్వా వేధింపులకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తనకి ఎదురైన సంఘటనను, పోలీసుల తీరును వివరించారు. సాచి మార్వా పోస్ట్ ప్రకారం… ఢిల్లీలో పని ముగించుకుని తిరుగు ప్రయాణం అవుతుండగా.. ఇద్దరు వ్యక్తులు బైక్ మీద ఆమెను వెంబడించారు. ఆమె కారును బైక్ తో ఢీ కొట్టారు. ఈ నెల 4న ఈ ఘటన జరిగింది. ఈ విషయం పోలీసులకు చెబితే… వారు పట్టించుకోలేదు!
Advertisement
READ ALSO : Rakul Preet Singh : బికినీలో మంచునే కలిగిస్తున్న రకుల్ ప్రీత్… వీడియో వైరల్
“బైక్ మీద ఇద్దరు నా కారును వెంబడించారు. తర్వాత నా కారును బైకుతో ఢీకొట్టారు. నేను సురక్షితంగా ఇంటికి చేర గలిగాను. తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్లాను. జరిగిన విషయాన్ని వివరించాను. కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించారు. మళ్లీ ఇలాంటిది ఏమైనా జరిగితే నెంబర్ ప్లేట్ లో నెంబర్ రాసుకొని రండి అని అన్నారు” అని పేర్కొన్నారు సాచి మార్వా. నితీష్ రానా భార్య సాచి పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
READ ALSO : Newsense : ‘న్యూసెన్స్’ ట్రైలర్.. మీడియాను టార్గెట్ చేశారా?