Home » పెద్ద పొర‌పాటు.. నిఖిల్‌కి బ‌దులు నితిన్‌..!

పెద్ద పొర‌పాటు.. నిఖిల్‌కి బ‌దులు నితిన్‌..!

by Anji
Ad

ఇటీవల బీజేపీ జాతీయ నాయకులు తెలుగు హీరోలను క‌లిసిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం మునుగోడు బ‌హిరంగ స‌భ‌కు వెళ్లిన సంద‌ర్భంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా.. ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా వరంగల్ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. హీరో నితిన్ తో సమావేశం అయ్యారు. అయితే ఈ రెండు మర్యాదపూర్వక భేటీలేనని కమలనాథులు చెబుతున్నారు.


ఇక్క‌డే పెద్ద పొరపాటు జ‌రిగింద‌నే చెప్పాలి. అది ఏంటంటే.. హీరో నిఖిల్ కి బదులు నితిన్ ని ఆహ్వానించారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది. కార్తికేయ 2 భారీ విజయాన్ని సాధించిన సందర్భంగా హీరో నిఖిల్ ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కలవాల్సి ఉండ‌గా.. పొరపాటున నిఖిల్ అనుకొని నితిన్ కి ఆహ్వానం పంపారట. కార్తికేయ 2 సినిమాలో కృష్ణతత్వం, హిందూ గొప్పతనం వివరించడంతో.. అయితే హిందూ భావాలను జనాల్లోకి తీసుకెళ్లే పార్టీగా నిఖిల్ ని కలవడం తమకు కలిసొస్తుందని.. అందుకే హీరో నిఖిల్ ని సన్మానించాలని భావించారట.

Advertisement

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  ఈవెంట్ అని చెప్పి పర్సనల్ గా కలవమన్నారు.. గలాటా గీతూ షాకింగ్ కామెంట్స్..!!


ఇప్పుడు అమిత్ షా మ‌ళ్లీ హైద‌రాబాద్ కి రాబోతున్నాడు. ఆ స‌మ‌యంలో కార్తికేయ 2 సినిమాతో స‌క్సెస్ ని ద‌క్కించుకున్న యంగ్ హీరో నిఖిల్ ని అభినందించేందుకు క‌ల‌వ‌బోతున్న‌ట్టుగా స‌మాచారం. దేశ‌వ్యాప్తంగా కార్తికేయ 2 సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిఖిల్ ని క‌ల‌వాల‌ని ఉద్దేశంతో ఉన్నార‌ట‌. ఇక హైద‌రాబాద్ వ‌చ్చిన స‌మ‌య‌లో త‌ప్ప‌కుండా నిఖిల్ తో భేటీ ఏర్పాటు చేయాల‌ని అమిత్ షా కి సంబంధించిన వారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయ‌కుల‌ను ఆదేశించిన‌ట్టు స‌మాచారం. అమిత్ షా నుంచి ఆహ్వానం అందితే మాత్రం నిఖిల్ ఉత్సాహంగా వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయంటూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. అమిత్ షాతో నిఖిల్ భేటీ ఎప్పుడు ఉంటుంద‌నేది వేచి చూడాలి మ‌రి.

ఇది కూడా చ‌ద‌వండి : రేణూ దేశాయ్ ఫ్యామిలీ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు…?

 

Visitors Are Also Reading