Home » ఈవెంట్ అని చెప్పి పర్సనల్ గా కలవమన్నారు.. గలాటా గీతూ షాకింగ్ కామెంట్స్..!!

ఈవెంట్ అని చెప్పి పర్సనల్ గా కలవమన్నారు.. గలాటా గీతూ షాకింగ్ కామెంట్స్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 6 లోకి ఎంట్రీ ఇచ్చిన గలాటా గీతూ ఒకప్పుడు టిక్ టాక్ వీడియో తో చాలా పేరు సంపాదించుకుంది. అంతేకాకుండా బిగ్ బాస్ రివ్యూలు ఇస్తూ మరింత పాపులర్ అయింది. చిత్తూరు యాసలో అంత గలాటా చేసి గలాటా గీతు గానే పేరు మారిపోయింది. అయితే ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తనకు ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అని చెప్పి, ఆ హీరో అంటే చచ్చేంత ఇష్టం అని, ఆయనంటే చేయి కూడా కోసుకుంటా అంత పిచ్చి అని వ్యాఖ్యానించింది. తనకు మాట్లాడడం అంటే చాలా ఇష్టమని ఆర్. జే.గా కూడా చేశానని అన్నది.

Advertisement

ALSO READ;బాధ, కోపాన్ని ఉద‌య్ కిర‌ణ్ ఎందుకు త‌న‌లోనే దాచుకున్నాడు…? సంచ‌ల‌న నిజాలు బయ‌ట‌పెట్టిన న‌టుడు..!

Advertisement

అంతే కాకుండా ఈమెకు ఓ పెద్ద బ్యానర్ నుంచి సినిమా అవకాశాలు వచ్చినా తనకు యాక్టింగ్ రాదని చెప్పి వదులుకున్నట్టు తెలియజేసింది. దీని తర్వాత రెండు చిన్న సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు లభించలేదు. ఈ తరుణంలోనే గలాటా గీతూ కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. నాకు కూడా ఒక చేదు అనుభవం ఎదురైంది అంటూ అన్నది.. ఆస్ట్రేలియా లో ఒక ఈవెంట్ కొరకు ఫోన్ చేశారని, తనకు హోస్టింగ్ అంటే ఇష్టం అందుకే ఒప్పుకున్నట్టు తెలియజేసింది.

ఆస్ట్రేలియా కాబట్టి షాపింగ్ కూడా చేసుకోవచ్చని రెమ్యూనరేషన్ కూడా ఎక్కువ ఇస్తా అనడంతో వెంటనే ఓకే చెప్పిందట.. టికెట్ బుక్ చేసుకునే సమయానికి మేనేజర్ పి.ఏ కాల్ చేసి.. మా మేనేజర్ తో మీకు పర్సనల్ గా కలవడం ఓకే కదా.. అలా చేస్తే మీకు ఎక్కువ డబ్బులు ఇస్తామని అడిగారట.. ఒక్కసారి గా గీతూ మైండ్ బ్లాక్ అయిపోయిందట.వెంటనే ఫ్లైట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నా అని చెప్పేసింది.. ప్రస్తుతమున్న గ్లామర్ రంగంలో ఇలాంటివి ఎక్కువైపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ALSO READ;రెండో పెళ్లికి రెడీ అవుతున్న సమంత….? వరుడు అతడేనట…?

Visitors Are Also Reading