Home » రేణూ దేశాయ్ ఫ్యామిలీ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు…?

రేణూ దేశాయ్ ఫ్యామిలీ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు…?

by AJAY
Published: Last Updated on
Ad

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. బద్రి సినిమాతో రేణూ దేశాయ్ టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయ్యారు. ఈ సినిమా త‌ర‌వాత మ‌ళ్లీ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు జోడీగా జానీ అనే సినిమాలో కూడా హీరోయిన్ గా న‌టించారు. ఈ సినిమాలో స‌మ‌యంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డ‌గా ఆ త‌ర‌వాత కొన్నాళ్ల‌పాటూ డేటింగ్ చేసి వివాహం చేసుకున్నారు. కానీ ప‌వ‌న్ ర‌ష్యా న‌టి అన్నా లెజొనోవాను పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్న స‌మ‌యంలో రేణూదేశాయ్ ఆయ‌న నుండి విడాకులు తీసుకున్నారు.

Advertisement

ప్ర‌స్తుతం రేణూ దేశాయ్ పూణేలో నివాసం ఉంటున్నారు. అకీరా నంద‌న్, ఆద్య కూడా రేణూ దేశాయ్ వ‌ద్ద‌నే ఉంటున్నారు. ఇక రేణూ దేశాయ్ త్వ‌ర‌లోనే న‌టిగా రీఎంట్రీ కూడా ఇవ్వ‌బోతున్న‌ట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ఇప్ప‌టికే టీవీ షోల‌లో రేణూ దేశాయ్ సంద‌డి చేస్తున్నారు. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కూడా రేణూ దేశాయ్ కి చాలా ఫాలోయింగ్ ఉంది. చూడ్డానికి తెలుగువారిలో చీర‌క‌ట్టులో క‌నిపిస్తూ ఉంటారు.

Advertisement

త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి సినిమాల గురించి కూడా ఫ్యాన్స్ కు అప్డేట్స్ ఇస్తుంటారు. రీసెంట్ గా జీవితంలో తోడు ఉండాలంటూ ఓ పోస్ట్ చేశారు. దాంతో త్వ‌ర‌లోనే రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ బ్యాగ్రౌండ్ గురించి అంద‌రికీ తెలుసు కానీ రేణూ దేశాయ్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి చాలా మందికి తెలియ‌దు.

రేణూ దేశాయ్ గుజ‌రాతి ఫ్యామిలీకి చెందిన వారు. ప్ర‌స్తుతం త‌మ కుంటుంబ స‌భ్యుల‌కు ద‌గ్గ‌ర పిల్ల‌ల‌తో కలిసి పూణేలోనే ఉంటున్నారు. రేణూ దేశాయ్ త‌ల్లి దండ్రులు మ‌రియు ఆమె సోద‌రుడు కూడా పూణేలోనే ఉంటున్నారు. ఇక రేణూ దేశాయ్ కేవ‌లం హీరోయ‌న్ గానే కాకుండా కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా ఎడిటర్ గా కూడా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం ఆమె ఓ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హిస్తున్నారు.

Visitors Are Also Reading