Home » సోష‌ల్ మీడియా లో ప్రెగ్నెన్సీ కిట్ షేర్ చేసిన నిత్యామీన‌న్‌.. అస‌లు విష‌యం ఏంటంటే ?

సోష‌ల్ మీడియా లో ప్రెగ్నెన్సీ కిట్ షేర్ చేసిన నిత్యామీన‌న్‌.. అస‌లు విష‌యం ఏంటంటే ?

by Anji
Ad

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ల‌లో నిత్యామీన‌న్ ఒక‌రు. తెలుగు చిత్ర పరిశ్రమలో అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కంటెంట్ పాత్ర ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని సినిమాలను సెలెక్ట్ చేసుకోవడం నిత్యా స్టైల్. ఇటీవల బీమ్లా నాయక్, తిరు వంటి చిత్రాలలో ప్రేక్షకులను అల‌రించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటో అభిమానులను అయోమయంలో పడేసింది.

Also Read : ఆలీ కూతురు పెళ్లికి సీఎం జగన్ గిఫ్ట్.. ఏంటంటే..?

Advertisement

Manam

ఫాసిఫయర్ తో పాటు ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ షేర్ చేస్తూ “అద్భుతం మొదలైంది” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె షేర్ చేసిన పోస్ట్ పై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పోస్ట్ చేయడం ఏంటి మీకు పెళ్లి జరిగిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తన తదుపరిచిత్రంలో భాగంగా ఈ ప్రెగ్నెన్సీ కి షేర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తన నెక్స్ట్ సినిమా ప్రమోషన్స్ కోసమే నిత్య ఇలా ప్రెగ్నెన్సీ కిట్ షేర్ చేసిందని మరే రీజన్ లేదని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. కానీ నిత్య మాత్రం తన గురించి వస్తున్న కామెంట్స్ పై ఇంకా స్పందించలేదు.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వెండితెరపైనే కాదు ఓటీటీలోనూ అలరిస్తుంది. ఇటీవల ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్ షోలో న్యాయనిర్నేతగా మెప్పించింది నిత్య. ఇక తెలుగు, తమిళంలోనూ స్టార్ హీరో ధనుష్ సరసన తిరు చిత్రంలో కనిపించింది. ఇవే కాకుండా నిత్యకు తెలుగులో మరిన్ని ఆఫర్స్ క్యూ కడుతున్నాయట. అయితే కంటెంట్ రోల్ ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకొని నిత్య ఆచితూచి అడుగులు వేస్తుందట. అయితే కొద్ది రోజులుగా నెట్టింట సైలెంట్ అయిన నిత్య ఆకస్మాత్తుగా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ షేర్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది.

Also Read : చరణ్ కు చెల్లెలుగా చేసిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఎంత అందంగా ఉందంటే..?

 

Visitors Are Also Reading