Home » ఆలీ కూతురు పెళ్లికి సీఎం జగన్ గిఫ్ట్.. ఏంటంటే..?

ఆలీ కూతురు పెళ్లికి సీఎం జగన్ గిఫ్ట్.. ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ కమెడియన్లలో ఆలీ కూడా ఒకరు. ఆయన ఇప్పటికే వేలాది సినిమాల్లో నటించి స్టార్ కమెడియన్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి ఆలీ సినిమాలతో పాటుగా రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా ఉంటారు. ఎన్నికల సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించి ఎంతో సహకారం అందించారు.

Advertisement

also read:స్కూటీ కోసం రూ.10 కాయిన్స్‌తో షోరూంకి చేరుకున్న యువ‌కుడు.. సిబ్బందికి చెమ‌ట‌లు..!

దీంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సినీ నటుడు ఆలీకి మంచి శుభవార్త చెప్పారు. ఆయనను ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ అంశంపై ఆలీ కూడా స్పందించారు. తను పార్టీలో చేరినప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నానని, జగన్ మనసులో కొంత స్థానాన్ని సంపాదించానని అన్నారు. పదవులు ఏనాడు ఆశించలేదని కానీ ఇప్పుడు పదవి రావడం చాలా సంతోషంగా ఉందని, ఆలీ చెప్పుకొచ్చారు.

Advertisement

 

2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించి, జగన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారమే నడుచుకున్నానని ఆలీ అన్నారు. తాను చేసిన సేవకు గుర్తింపుగా జగన్ గారు ఈ పదవి ఇవ్వడం ఆనందదాయకమని అన్నారు. నాకు ఇచ్చిన ఈ బాధ్యతలను పూర్తి నిబద్దతతో నిర్వహిస్తానని చెప్పారు. జగన్ ఇచ్చిన ఈ పదవి ఏదైతే ఉందో తన కూతురు వివాహానికి ఇచ్చిన గిఫ్ట్ గా తాను స్వీకరిస్తున్నానని కమెడియన్ ఆలీ చెప్పుకొచ్చారు.

also read:

Visitors Are Also Reading