Home » అద‌ర‌గొడుతున్న‌ ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ ఫ‌స్ట్ లుక్ ..!

అద‌ర‌గొడుతున్న‌ ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ ఫ‌స్ట్ లుక్ ..!

by Anji
Ad

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ న‌టిస్తోన్న చిత్రం మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం. ఎం.ఎస్‌. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర‌ములో నితిన్ స‌ర‌స‌న కేథ‌రిన్ థెరిసా, కృతిశెట్టి క‌థానాయిక‌లుగా నిటిస్తున్నారు. ఆదిత్య మూవీస్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్‌రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌గా తెరకెక్కుతుండ‌గా.. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Advertisement


ఇక చిత్రంలో నితిన్ ఐఏఎస్ అధికారి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. గుంటూరు జిల్లాకు క‌లెక్ట‌ర్ ఎన్‌.సిద్దార్థ్ రెడ్డిగా క‌నిపించ‌నున్నారు. ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర‌బృందం విడుదల చేసింది. బ్లాక్ అండ్ బ్లాక్ దుస్తుల్లో నితిన్ సీరియ‌స్ లుక్‌లో కనిపిస్తున్నాడు. నితిన్ వెన‌కాల పులి గెట‌ప్‌ల‌తో విల‌న్లు త‌న మీద క‌త్తి దూయ‌డానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ చూస్తుంటే.. ఏదో పోరాట స‌న్నివేశానికి సంబంధించిందిగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ లుక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Advertisement

Also Read :  వారం రోజుల్లోనే పునిత్ చివ‌రి సినిమాను ఎత్తేసిన థియేట‌ర్లు..!

Visitors Are Also Reading