Home » మరో పెళ్లికి సిద్ధమైన నిహారిక మాజీ భర్త.. అమ్మాయి ఎవరో తెలుసా..?

మరో పెళ్లికి సిద్ధమైన నిహారిక మాజీ భర్త.. అమ్మాయి ఎవరో తెలుసా..?

by Anji
Ad

మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ చైతన్య దంపతులు తమ పెళ్లి బంధానికి గుడ్ భై చెప్పిన విషయం తెలిసిందే. 2020 డిసెంబర్ లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట.. కనీసం రెండేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. ఇద్దరి మధ్య మనస్పార్థాలు రావడంతో కొద్ది రోజుల పాటు వేర్వేరుగా జీవించి.. ఈ మధ్యే అధికారికంగా విడాకులను తీసుకున్నారు. ఎందుకంటే.. నిహారిక సినీ ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీ నుంచి రావడంతో ఆమె ఎక్కువగా సినీ కల్చర్ లోనే ఉండేది. కానీ సినిమా ఇండస్ట్రీకి ఏ మాత్రం టచ్ లేని పోలీస్ ఆఫీసర్ కుటుంబం నుంచి వచ్చాడు జొన్నలగడ్డ చైతన్య. 

Advertisement

దీంతో నిహారిక చైతన్యకి మధ్య సఖ్యత కుదరలేదు. దీంతో ఈ ఏడాది వీళ్లిద్దరూ అఫిషియల్ గా విడాకులతో విడిపోయారు. ఈ విడాకుల తరువాత నిహారిక తన సినీ కెరీర్ బిజీ అవుతుంది. ఇప్పుడిప్పుడే నాలుగు అయిదు ప్రాజెక్టులు చేతిలో ఉన్నట్టు స్పష్టం చేసింది. విడాకులు తీసుకున్న తరువాత కెరీర్ పరంగా బిజీ అయింది నిహారిక. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తూ.. నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. అంతేకాదు.. నిహారిక సినిమాల్లో బిజీ అయితే సినిమాల్లో బిజీ అయితే.. జొన్నలగడ్డ చైతన్య మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. పెళ్లి చేసుకునేందుకు ఓ అమ్మాయిని ఓకే చేసినట్టు సమాచారం. 

Advertisement

టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. జొన్నల గడ్డ చైతన్య ఫ్యామిలీ పోలీస్ కుటుంబం కాబట్టి వారి కుటుంబానికి తగినట్టుగానే.. మరో ఐపీఎస్ ఆఫీస్ కూతురుని జొన్నలగడ్డ పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే.. జొన్నలగడ్డ చైతన్య జీవితం ఎటూ కాకుండా పోయింది. అందుకే ఈ సారి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండే పోలీస్ ఆఫీసర్ కుటుంబం నుంచి వచ్చే అమ్మాయిని తమ ఇంటికి కోడలుగా చేసుకోవాలని జొన్నలగడ్డ ఫ్యామిలీ అభిప్రాయపడుతున్నారట. జొన్నల గడ్డ చైతన్యకి కూడా ఆ అమ్మాయి నచ్చడంతో త్వరలోనే గ్రాండ్ గా చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది మాత్రం తెలియాల్సి ఉంది.  

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

కూతురు వయసు ఉన్న అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన పృథ్వీ..?

రజని తన కోసం సొంతంగా రాసుకున్న కథతో మోహన్ బాబు నటించిన ఫ్లాప్ సినిమా అదేనా ? :

Visitors Are Also Reading