Telugu News » రజని తన కోసం సొంతంగా రాసుకున్న కథతో మోహన్ బాబు నటించిన ఫ్లాప్ సినిమా అదేనా ? :

రజని తన కోసం సొంతంగా రాసుకున్న కథతో మోహన్ బాబు నటించిన ఫ్లాప్ సినిమా అదేనా ? :

by Bunty

సూపర్ సార్ రజనీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏజ్ పైబడినప్పటికీ భారీ యాక్షన్ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు సూపర్ సార్ రజనీకాంత్. యంగ్ హీరోలతో పోటీపడి మరి బంపర్ విజయాలను అందుకుంటున్నారు. ఇటీవల కాలంలో జైలర్ సినిమాతో ఏకంగా 700 కోట్లను కొల్లగొట్టారు సూపర్ స్టార్ రజనీకాంత్.

Mohan Babu grabbing a story from Rajinikanth

Mohan Babu grabbing a story from Rajinikanth

ఇక ఇప్పుడు మరో భారీ మల్టీస్టారర్ మూవీ కోసం రజనీకాంత్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అమితాబచ్చన్ మరియు రానా నటించిన తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా మోహన్ బాబు కారణంగా ఓ సినిమాను సూపర్ స్టార్ రజినీకాంత్ వదులుకున్నారు. మరి ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మంచు మోహన్ బాబు హీరోగా రాయలసీమ రామన్న చౌదరి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మోహన్ బాబు యాక్టింగ్ ఇరగదీశారు. అయితే ఈ సినిమా కథను సూపర్ స్టార్ రజినీకాంత్ రాశారు.

కానీ తెలుగులో మోహన్ బాబు ఈ సినిమా చేయాలని… తమిళంలో తాను రీమేక్ చేస్తానని రజనీకాంత్ నిర్ణయం తీసుకున్నారు. అయితే తెలుగులో రాయలసీమ రామన్న చౌదరి అట్టర్ ప్లాప్ అయింది. కానీ మోహన్ బాబుకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ సినిమాకు మోహన్ బాబు మాత్రమే కరెక్ట్… అద్భుతంగా నటించాడని మెచ్చుకున్న సూపర్ సార్ రజనీకాంత్… తమిళంలో రీమేక్ కూడా చేయలేదు. ఆ సినిమాకు తను అర్హున్ని కాదని… ఈ ప్రాజెక్టు ముట్టుకోలేదు రజనీకాంత్.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading