Home » భ‌ర్త‌తో విడాకుల వార్త‌లు…ఆ పోస్ట్ తో క్లారిటీ అయోమ‌యంలో ప‌డేసిన‌ నిహారిక‌..!

భ‌ర్త‌తో విడాకుల వార్త‌లు…ఆ పోస్ట్ తో క్లారిటీ అయోమ‌యంలో ప‌డేసిన‌ నిహారిక‌..!

by AJAY
Published: Last Updated on

మెగాడాట‌ర్ నిహారిక త‌న భ‌ర్త చైత‌న్య‌కు విడాకులు ఇవ్వ‌బోతుందా..? అంటే అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. అయితే గ‌తంలోనూ ఇలాంటి వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి కానీ ఆ వార్త‌ల‌కు ఆధారాలు లేక‌పోవ‌డంతో ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. మ‌రి ఇప్పుడు అంత‌టి బ‌లమైన ఆధారాలు ఏం ఉన్నాయి అనే డౌట్ ప్ర‌తిఒక్క‌రిలో రావ‌చ్చు. కానీ బ‌ల‌మైన ఆధార‌మే ఒక‌టి ఉంది.

ALSO READ : తల్లిదండ్రులు పిల్లల ముందు అస్సలు చేయకూడని ఈ 5 పనులు ఏంటో మీకు తెలుసా..?

బాలీవుడ్ లో అయినా టాలీవుడ్ లో అయినా విడాకులు తీసుకుంటున్నారు అంటూ సెల‌బ్రెటీలు ముందుగా చేసే ప‌ని త‌మ పార్ట్న‌ర్ తో ఉన్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియా నుండి డిలీట్ చేయ‌డం. గ‌తంలో స‌మంత నాగ‌చైత‌న్య కూడా అలానే చేశారు. అంతే కాకుండా త‌మిళ హీరో ధ‌నుష్ త‌న భార్య ఐశ్వ‌ర్య కూడా అలానే చేశారు. అంతెందుకు మెగాడాట‌ర్ శ్రీజ త‌న భ‌ర్త క‌ల్యాణ్ కూడా అలానే చేశారు.

ఇక ఇప్పుడు నిహారిక దంప‌తులు కూడా అలానే చేశారు. సోష‌ల్ మీడియాలో నిహారిక చైత‌న్య‌లు ఒక‌రినొక‌రు అన్ ఫాలో చేసుకోవ‌డంతో పాటూ చైత‌న్య పెళ్లి ఫోటోలు అన్నీ డిలీట్ చేశాడు. అంతే కాకుండా పెళ్లైన కొత్త‌లో ఫోటోల‌ను షేర్ చేసిన ఈ జంట ఇప్పుడు అస‌లు త‌మ ఫోటోల‌ను షేర్ చేయ‌డం లేదు. అంతే కాకుండా పార్టీలలో సినిమా ఈవెంట్ ల‌లోనూ క‌నిపించ‌డం లేదు.

niharika konidela

niharika konidela

దాంతో చైతన్య నిహారిక విడాకుల వార్త‌ల‌కు ఆజ్యం పోసిన‌ట్ట‌యింది. ఇదిలా ఉంటే విడాకులు వార్త‌లు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంటే నిహారిక చైత‌న్య‌లు మాత్ర ప‌ట్టించుకోవ‌డం లేదు. మ‌రోవైపు నిహారిక అయితే త‌న కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసింది. కొత్త సంవత్స‌రం కొత్త అనౌన్స్ మెంట్ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చి డెడ్ పిక్స‌ల్స్ అనే టైటిల్ ను షేర్ చేసింది. దాంతో నిహారిక విడాకుల వార్త‌ల‌పై స్పందిచ‌క‌పోవ‌డంతో నెటిజ‌న్ ల అనుమానాలు రెట్టింప‌వుతున్నాయి.

ALSO READ :50 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ…..న‌టులు!!

Visitors Are Also Reading