Telugu News » 50 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ…..న‌టులు!!

50 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ…..న‌టులు!!

by Azhar

సినిమా ఇండ‌స్ట్రీకి ఎన్నో ఏళ్ళుగా త‌మ సేవ‌ల‌ను అందించి వ‌య‌సు భారంతో ఇంటివ‌ద్దే ఉంటూ ప్ర‌శాంతంగా జీవిస్తున్న వారు.. అలాగే 70ఏళ్ళు పైబ‌డినా ఇంకా తెర పై దూసుకుపోతున్న‌వారు ఎవ‌ర‌నేది తెలుసుకుందాం. మ‌న్న‌న బాల‌య్య ఈయ‌న వ‌య‌సు 91 యాక్ట‌ర్‌గా, డైరెక్ట‌ర్‌గా, నిర్మాత‌గా టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న సినిమాలు చేయ‌క‌పోయినా ఆరోగ్యంగా ఉంటూ ఇంటి వ‌ద్దే ఉంటూ ఏదైనా ముఖ్య‌మైన ఫంక్ష‌న్స్‌కి అతిధి వ‌స్తున్నారు.

Ads

రామోజీరావు ప్రొడ్యూస‌ర్‌గా ఉషాకిర‌ణ్‌మూవీస్ సంస్థ‌ను పెట్ట‌డ‌మే కాక రామెజీ ఫిల్మ్ సిటీతో కొన్ని వేల సినిమాల‌తో అనుబంధాన్ని ముడిపెట్టుకున్నారు. ఈటీవీ వ్య‌వ‌స్థాప‌కులు ఈయ‌న వ‌య‌సు 85 సంవ‌త్స‌రాలు ఏదైన ముఖ్య‌మైన ఫంక్ష‌న్ల‌కు వ‌స్తారు.

 

సీనియ‌ర్ యాక్ట‌ర్ శార‌ద ప్ర‌స్తుతం ఈమె వ‌య‌సు 77 సంవ‌త్స‌రాలు బ్లాక్ అండ్ వైట్ నుండి వెండితెర పై వెలుగు వెలుగుతూ వ‌చ్చారు. ప్ర‌స్తుతం ఎక్కువ‌గా దైవచింత‌న‌ములో గ‌డుపుతూ అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు తెర‌పై క‌నిపించేందుకు సిద్ధంగా ఉన్నారు.

కైకాల స‌త్య‌నారాయ‌ణ ఈయ‌న వ‌య‌సు 87 ప్ర‌స్తుతం కాస్త ఆరోగ్యం క్షీణించింది. అప్ప‌టి ఎన్టీఆర్ నుండి ఇప్ప‌టి జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌ర‌కు ఈయ‌నకు సినీ ఇండ‌స్ట్రీతో విడ‌దియ్య‌లేని అనుబంధం ఉంది.

కె. విశ్వ‌నాధ్ బహుముఖ ప్ర‌జ్ఞాశీలి. శుభ‌సంక‌ల్పం, స్వ‌యంకృషి, శంక‌రాభ‌ర‌ణం వంటి ఎన్నో ఆణిముత్యాల‌ను వెండితెర‌కు అందించ‌డ‌మేకాక న‌ట‌న‌లోనూ ఆయ‌న ప్ర‌తిభ‌ను చాటారు.

సీనియ‌ర్ హీరోయిన్ వాణిశ్రీ ఈమె వ‌య‌సు 74 ఎన్టీఆర్‌, ఏఎన్నార్ టైమ్‌లో నెంబ‌ర్ 1గా వెలిగిన ఈమె ప్ర‌స్తుతం చెప్పుకోద‌గ్గ క్యారెక్ట‌ర్ వ‌స్తే న‌టించ‌డానికి సిద్ధం అంటున్నారు.

మరో హీరోయిన్ జ‌మున ఈమె వ‌య‌సు 86 సంవ‌త్స‌రాలు ఇక ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది ఇప్ప‌టికీ అదే చ‌లాకీత‌నం. చిన్న‌పిల్ల వ‌లె త‌న ఇంట్లో డ్యాన్స్‌లు వ‌స్తూ ఉంటారు. బ్లాక్ అండ్ వైట్ కాలంలో 100కు పైగా చిత్రాల్లో న‌టించారు ఆమె.

మ‌రో సీనియ‌ర్ యాక్ట‌ర్ శ‌ర‌త్‌బాబు వ‌య‌సు 71 ఎంతో హెల్తీగా సినిమాల్లో న‌టించేందుకు ఉత్సాహంగా ఉన్నారు.

ర‌మాప్ర‌భ వ‌య‌సు 75 ఏళ్ళు. మొత్తం ప‌ద్నాలుగుకి పైగా చిత్రాల్లో న‌టించారు ఆమె. సీనియ‌ర్ యాక్ట‌ర్ కృష్ణంరాజు ఈయ‌న వ‌య‌సు 83 మంచి యాక్టివ్‌గా సినిమాల్లోనూ, రాజ‌కీయాల్లోనూ దూసుకుపోతున్నారు. బి. స‌రోజాదేవి ఈమె వ‌య‌సు 85 సంవ‌త్స‌రాలు 1990వ‌ర‌కు సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. భ‌ర్త దూర‌మ‌వ‌డంతో వెండితెర‌కు దూర‌మ‌యిప్ర‌స్తుతం కొన్ని స్వ‌చ్ఛంధ సంస్థ‌లు న‌డుపుతూ కాలాన్ని వెళ్ళ‌దీస్తున్నారు.

సీనియ‌ర్ యాక్ట‌ర్ గిరిబాబు మొన్న‌టి వ‌ర‌కు సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. ఈయ‌న వ‌య‌సు 83. ప్ర‌స్తుతం ఇంటివ‌ద్దే ఉంటున్నారు. డైరెక్ట‌ర్ కె. రాఘ‌వేంద్ర‌రావు వ‌య‌సు 81 కానీ చూడ్డానికి ఈయ‌న చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇప్ప‌టికీ సినిమాల్లో కనిపిస్తున్నారు. చ‌ల‌ప‌తిరావు వ‌య‌సు 78 ఫుల్ యాక్టివ్‌గా సినిమాల్లో న‌టిస్తున్నారు. సీనియ‌ర్ యాక్ట‌ర‌స్ అన్న‌పూర్ణ‌74 వ‌య‌సు కొన్ని వంద‌ల చిత్రాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా న‌టించారు.

రీసెంట్‌గా ఎఫ్‌2 చిత్రంలో త‌న కామెడీ టైమింగ్‌తో అద‌ర‌గొట్టారు. ఇక మ‌రో సీనియ‌ర్ న‌టీమ‌ణి కాంచ‌న 83 సంవ‌త్స‌రాలు ఆరోగ్యంగా ఇంటి వ‌ద్దే ఉంటున్నారు. మ‌రో సీనియ‌ర్ న‌టులు చంద్ర‌మోహ‌న్ 77 సంవ‌త్స‌రాలు చ‌లాకీగా అడ‌పా ద‌ప‌డా సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. మ‌రో న‌టులు ముర‌ళీ మోహ‌న్ 82 సంవ‌త్స‌రాలు చాలా యాక్టివ్‌గా పాలిటిక్స్‌లో ర‌న్ అవుతున్నారు. మ‌రో సినియార్ యాక్ట‌ర్ హీరో కృష్ణ వ‌య‌సు 79 సంవ‌త్స‌రాలు. ఆరోగ్యంగా ఉన్నారు. అప్పుడ‌ప్పుడు సినిమా ఫంక్ష‌న్ల‌కు అటెండ్ అవుతారు. ఇక మాములుగా 30ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అంటేనే చాలా మంది గొప్ప‌గా చెప్పుకుంటుంటారు. కానీ వీరు క‌నీసం 50ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీలో త‌మ సేవ‌ల‌కు అందించారు. ఇంకా కొంత మంది అందిస్తున్నారు.


You may also like