మెగాస్టార్ బ్రదర్స్ లలో ఒకరైనటువంటి నాగబాబు కుమార్తె, నటి నిహారిక కొద్ది సంవత్సరాల కిందట జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం కావడంతో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో చాలా అంగరంగవైభవంగా జరిపించారు. వీరి వివాహం జరిగి దాదాపు మూడేళ్లు కావస్తోంది. వీరిద్దరూ విడిపోబోతున్నారు అంటూ పుకార్లు మాత్రం చాలా సార్లు చక్కర్లు కొట్టాయి.
Also Read : ఎంతసేపు ఎండలో ఉంటే విటమిన్ డి లభిస్తుందో తెలుసా ..?
Advertisement
ఇప్పుడు మరోసారి వీరిద్దరూ విడిపోబోతున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిని సూచిస్తూ ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో కూడా చేసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాస్తవానికి అటు నిహారిక ఇటు చైతన్య జొన్నలగడ్డ ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఇన్ స్టా గ్రామ్ లో తమ ఫోటోలు అప్ లోడ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. యాక్టివ్ గా ఎప్పటికప్పుడు సందడి చేస్తూ ఉండే వారు ఒకరినొకరు ఇన్ స్టా గ్రామ్ లో ఇప్పుడు అన్ ఫాలో చేసుకున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన బంగ్లా బ్యాట్స్ మెన్ ఎవరో తెలుసా ?
నిహారికతో కలిసి ఉన్న ఫోటోలతో పాటు.. పెళ్లి ఫోటోలను సైతం డిలీట్ చేశాడు. అయితే ఒక్క ఫోటోను మాత్రం అలాగే ఉంచాడు. తను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న గోల్డెన్ రిట్రైవర్ జాతికి చెందిన కుక్కపిల్ల బజ్ తో నిహారిక దిగినటువంటి ఫోటో అతని ఇన్ స్టా గ్రామ్ లో మాత్రం ఇంకా ఉంది. ఈ ఫోటో 2020 డిసెంబర్ 18న అప్ లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ జంట విడిపోతుందని రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.
Also Read : యాంకర్ శ్యామల గుర్తుందా.. మరి ఇంత సన్నగా మారిందేంటి..?