Home » ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన బంగ్లా బ్యాట్స్ మెన్ ఎవరో తెలుసా ?

ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన బంగ్లా బ్యాట్స్ మెన్ ఎవరో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడు ఏ రికార్డు నమోదవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. కొన్ని సందర్భాల్లో హ్యాట్రిక్ వికెట్లు పడితే.. మరికొన్ని సందర్భాల్లో సెంచరీలు నమోదవుతాయి. ఇలా ఏదో ఒక రికార్డు నిత్యం జరుగుతూనే ఉంటుంది. మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఐర్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ ముష్పికర్ రహీం విధ్వంసమే సృష్టించాడు.  

Also Read :  Mohanbabu:నేను సొంత బ్యానర్ పెట్టడం ఆయనకి ఇష్టం లేదు.. కారణం ఏంటంటే..?

Advertisement

ప్రధానంగా కేవలం 60 బంతుల్లోనే 100 పరుగులు సాధించాడు. ఇందులో 14 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. వన్డేలలో బంగ్లాదేశ్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన ఆటగాడిగా ముష్పికర్ రహీం రికార్డు నమోదు చేసాడు. అంతకు ముందు ఈ రికార్డును షకీబ్ పేరిట ఉండేది. 2009లో షకీబ్ జింబాబ్వేపై 63 బంతులలో సెంచరీని పూర్తి చేశాడు. 6వ స్థానంలోకి బరిలోకి దిగిన ముష్పికర్ ఆకాశమే హద్దుగా చెలరేగి వన్డే కెరీర్ లో 9వ సెంచరీ నమోదు చేయడంతో పాటు. 7వేల పరుగుల మైలు రాయిని అధిగమించాడు. 

Advertisement

Also Read :  యాంకర్ శ్యామల గుర్తుందా.. మరి ఇంత సన్నగా మారిందేంటి..?

ముష్పికర్ మెరుపు సెంచరీతో పాటు లిటన్ దాస్ (70), నజ్ముల్ హుస్సెన్ షాంటో (73) పరుగులు చేయడంతో బంగ్లాజట్టు ఆరు వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ జట్టుకు వన్డేలలో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఈ సిరీస్ లో మార్చి 18న ఐర్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో 338 పరుగులు చేసింది బంగ్లా టీమ్. 

Also Read :  వన్డేల్లో టీమిండియా అత్యల్ప స్కోరు ఎంతో తెలుసా?

Visitors Are Also Reading