Home » ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌లు పెంచుతూ జీవో జారీ

ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌లు పెంచుతూ జీవో జారీ

by Anji
Ad

టాలీవుడ్ కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త‌నే చెప్పింది. సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుతూ ఇవాళ కేబినెట్ లో రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిన‌దే. తాజాగా సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుతూ ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం జీవోను విడుద‌ల చేసింది. గరిష్ట సినిమా టికెట్‌ఖ ధ‌ర రూ.250 గా ప్ర‌భుత్వం కేటాయించింది. అదేవిధంగా క‌నిష్టంగా ఒక సినిమా టికెట్ ధ‌ర రూ.20 కు కేటాయించింది.

Advertisement

Advertisement

రాష్ట్రంలో 5 షోల‌కు ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. అయితే ఈ 5 షోల‌లో ఉద‌యం 11 గంట‌ల‌కు, రాత్రి 9 గంట‌లకు చిన్న సినిమాలు వేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం కండీషన్ పెట్టింది.  మున్సిపాలిటీల్లో నాన్ ఏసీ థీయేట‌ర్స్ లో టికెట్ ధ‌ర‌లు రూ. 30, రూ. 40గా, ఏసీ థియేట‌ర్స్‌లో రూ.60, రూ.80గా మ‌ల్టీప్లెక్స్‌ల్లో రూ.125గా కేటాయించింది.

అదేవిధంగా కార్పొరేష‌న్ల‌లో నాన్ ఏసీ థియేట‌ర్స్ లో టికెట్ ధ‌ర రూ.40, రూ.80గా ఏసీ థియేట‌ర్స్‌ల్లో రూ.70, రూ.100 మ‌ల్టీప్లెక్స్‌లో రూ.150, రిక్లైన‌ర్ రూ.250గా కేటాయించింది. న‌గ‌ర‌పంచాయ‌తీ గ్రామ‌పంచాయ‌తీల్లో నాన్ ఏసీ థియేట‌ర్స్‌ల‌లో టికెట్ ధ‌ర రూ. 20, రూ.40గా ఏసీ థియేట‌ర్స్‌ల‌లో రూ.50, రూ.70గా మ‌ల్టీప్లెక్స్‌ల‌లో రూ.100 గా కేటాయించింది.

 

Visitors Are Also Reading