Home » అక్టోబ‌ర్ 01 నుంచి కొత్త రూల్స్‌.. అవి ఏంటో తెలుసా..?

అక్టోబ‌ర్ 01 నుంచి కొత్త రూల్స్‌.. అవి ఏంటో తెలుసా..?

by Anji
Ad

మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..! మీ వ‌ద్ద డెబిట్ కార్డు ఉందా అయితే చాలా అల‌ర్ట్ గా ఉండండి. అక్టోబ‌ర్ 01 నుంచి రూల్స్ అమ‌లులోకి రానున్నాయి. రిజ‌ర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కార్డ్ ఆన్ ఫైల్ టోకెనైజేష‌న్ నియ‌మ‌నిబంధ‌న‌ల‌ను ప్ర‌కటించిన విష‌యం తెలిసిందే. ఈ రూల్స్ 2022 అక్టోబ‌ర్ 01 నుంచి అమ‌లు చేయాల‌ని ఆర్బీఐ ప్ర‌క‌టించింది.


వాస్త‌వానికి జులై 01 నుంచే ఈ రూల్స్ అమ‌లులోకి తీసుకురావాల్సి ఉండ‌గా.. బ్యాంకులు, మ‌ర్చెంట్స్ గ‌డువు కోర‌డంతో సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు గ‌డువు పొడిగించింది ఆర్బీఐ. ఇక ఎట్టి ప‌రిస్థితిలో అక్టోబ‌ర్ 01 నుంచి ఈ రూల్స్ అమ‌లులోకి రానున్న‌ట్టు తెలుస్తోంది. కార్డు టోకెనైజేష‌న్ రూల్స్ అమ‌లు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్టు ఇప్ప‌టికే ఎస్‌బీఐ కార్డు ప్ర‌క‌టించింది. ఈసారి ఆర్‌బీఐ గ‌డువు పెంచే ప‌రిస్థితే లేదు. కార్డు హోల్డ‌ర్లు ముఖ్య‌మైన డేటా హ్యాక‌ర్ల చేతుల్లోకి వెళ్ల‌కుండా ఉండేందుకు ఆర్‌బీఐ టోకెనైజేష‌న్ ప‌ద్ద‌తి తీసుకొచ్చింది. ఇప్ప‌టికే రూ.19.5 కోట్ల టోకెన్లు జారీ అయ్యాయ‌ని అంచ‌నా వేశారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు ఉన్న‌వారు ఆన్‌లైన్ లావాదేవీల కోసం త‌మ కార్డుల‌ను ఉప‌యోగించాలంటే టోకెనైజేష‌న్ చేయాల్సి ఉంటుంది. చేయ‌క‌పోతే ట్రాన్సాక్ష‌న్ జ‌రిగిన ప్ర‌తిసారి కార్డు వివ‌రాలు ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది.

Advertisement

Advertisement


ఉదాహ‌ర‌ణ‌కు మీ వ‌ద్ద ఉన్న క్రెడిట్ కార్డుతో ఫ్లిప్ కార్ట్ లో షాపింగ్ చేస్తున్నారునుకోండి. మీరు గ‌తంలో కార్డు వివ‌రాలు సేవ్ చేశారు. సీవీవీ, ఓటీపీ ఎంట‌ర్ చేసి ట్రాన్సాక్ష‌న్ పూర్తి చేయ‌వ‌చ్చు. అంటే మీ క్రిడిట్ కార్డు వివ‌రాలు ప్లిఫ్ కార్ట్ దగ్గ‌ర సేవ్ చేసి ఉన్నాయి. ఇక‌పై ఇలా మీ కార్డు వివ‌రాలు ఫ్లిప్‌కార్ట్ ద‌గ్గ‌ర ఉండ‌వు. మీరు మీ క్రెడిట్ కార్డుపై టోకెన్ క్రియేట్ చేయాలి. ఆ టోకెన్ నెంబ‌ర్ మాత్ర‌మే ఉంటుంది. ఇక ఆ టోకెన్ ఆధారంగా మీరు లావాదేవీలు చేయ‌వచ్చు. ప్రతీ మ‌ర్చెంట్‌కి వేర్వేరు టోకెన్లు క్రియేట్ అవుతాయి. మీరు కార్డు టోకెనైజ్ చేయ‌క‌పోతే ప్ర‌తీ లావాదేవీకి మీ కార్డు నెంబ‌ర్ ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది. కార్డు టోకెనైజేష‌న్ చేయాల‌ని బ్యాంకులు, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ లాంటి సంస్థ‌లు కోరుతున్నాయి. ఆర్‌బీఐ కూడా కార్డ్ టోకెనైజ్ చేయాల‌ని కార్ట్ హోల్డ‌ర్ల‌ను కోరుతుంది. ఎలా చేయాలో స్టెప్స్ కూడా వివ‌రించింది. మీ కార్డ్ టోకెనైజేష‌న్ కోసం ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

ఇది కూడా చ‌ద‌వండి :  ఈ 3 లక్షణాలు ఉన్న పురుషులను..మహిళలు చాలా ఇష్టపడతారట.. ఇందులో 2వది ఇంపార్టెంట్..!!

కార్డ్ టోకెనైజేష‌న్ ఇలా చేయండి :

  • ఏదైనా ఈ కామ‌ర్స్ వెబ్ సైట్ లేదా మ‌ర్చంట్ వెబ్‌సైట్ లేదా యాప్ ఓపెన్ చేసి పేమెంట్ ప్రాసెస్ ప్రారంభించండి.
  • చెకౌట్ స‌మ‌యంలో మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వివ‌రాల‌ను ఎంట‌ర్ చేయండి.
  • Secure your card లేదా Save card as per RBI guidelines ఆప్ష‌న్‌ని సెలెక్ట్ చేసుకోండి.
  • ఇక ఆ త‌రువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబ‌ర్ లేదా ఈ మెయిల్ ఐడీకి వ‌చ్చే ఓటీపీ ఎంట‌ర్ చేయండి.
  • మీ కార్డు వివ‌రాల‌కు బ‌దులుగా టోకెన్ జ‌న‌రేట్ అవుతుంది.
  • మీరు మ‌ళ్లీ అదే వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో ట్రాన్సాక్ష‌న్ చేస్తే మీ కార్డులోని చివ‌రి నాలుగు అంకెలు క‌నిపిస్తుంటాయి.

ఇది కూడా చ‌ద‌వండి  :  అసలు నా కూతురివి కాదంటూ.. అన్షుపై ఎమోషనల్ కామెంట్స్ చేసిన రోజా.. అలా ఎందుకు మాట్లాడిందబ్బా..!!

Visitors Are Also Reading