Home » గూస్ బంప్స్ తెప్పిస్తున్న “ఫోకస్” ట్రైలర్..ఆ ఒక్క డైలాగ్ తో..!!

గూస్ బంప్స్ తెప్పిస్తున్న “ఫోకస్” ట్రైలర్..ఆ ఒక్క డైలాగ్ తో..!!

by Sravanthi Pandrala Pandrala

యంగ్ టాలెంటెడ్ హీరో విజయ్ శంకర్, బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి కథానాయికగా వస్తున్న చిత్రం ఫోకస్.. మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ తో ఉత్కంఠభరితమైన కథ కథనంతో ఒక కొత్త సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ కూడా నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇప్పటికే ఐదు లక్షలకు పైగా వ్యూస్ సాధించి విశేష ఆదరణ సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో కథానాయికగా అషురెడ్డి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది.

also read:మహేష్ “ఒక్కడు”లో ధర్మవరపు చెప్పిన “98480329*9” నెంబర్ ఎవరిదంటే..?

ఇక సీనియర్ నటీనటులు సుహాసిని మణిరత్నం, షియాజీ షిండే, భానుచందర్, జీవా, సూర్య భగవాన్, రఘు బాబు, భరత్ రెడ్డి తదితర నటులు ప్రత్యేక ఆకర్షణగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సూర్యతేజ డైరెక్షన్ వహించగా, వీరభద్ర రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈనెల 28వ తేదీన ఈ మూవీ గ్రాండ్ గా థియేటర్లోకి రానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను హీరో శ్రీకాంత్ లాంచ్ చేశారు. ఈ తరుణంలో శ్రీకాంత్ మాట్లాడుతూ పోకస్ మూవీ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని, డైరెక్టర్ సూర్య తేజ మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారని, హీరో విజయ్ శంకర్ సరికొత్తగా నటించాడని అన్నారు.

ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని కోరారు. ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం అవుతున్న వీరభద్రరావు గారికి మరియు మిగతా చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు స్టార్ హీరో శ్రీకాంత్. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ.. ఫోకస్ మూవీ అనేది సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిందని, సస్పెన్స్ థ్రిల్లర్ గా ఊహించని మలుపులతో సినిమా ఉంటుందని తెలుగు ఆడియన్స్ కు చాలా కనెక్ట్ అవుతుందని, ప్రతి ఒక్కరు సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరారు.

also read:

Visitors Are Also Reading