Home » HYD: గ్రాండ్ గా ముస్తాబవుతున్న మహేష్ బాబు హోటల్స్.. పేర్లు బలే ఉన్నాయే..!!

HYD: గ్రాండ్ గా ముస్తాబవుతున్న మహేష్ బాబు హోటల్స్.. పేర్లు బలే ఉన్నాయే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రతి హీరో,హీరోయిన్ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే సినిమాల్లో సంపాదిస్తూ ఇతర బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ, వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆ కోణంలోనే మహేష్ బాబు కూడా ఏషియన్ సంస్థతో కలిసి ఏ ఎంబి సినిమాస్ నెలకొల్పి థియేటర్ బిజినెస్ లోకి ఇప్పటికే ఎంటర్ అయ్యారు.
దీని తర్వాత సొంతంగా క్లాతింగ్ బ్రాండ్ కూడా స్టార్ట్ చేశారు.

also read:పిల్లల జ్ఞాపకశక్తిని పెంచి, బాగా చదువుకునేలా చేసే పదార్ధాలు ఇవే..!

Advertisement

ఈ తరుణంలోనే మరో కొత్త రంగంలోకి అడుగుపెడుతున్నారు ఆయన. తన భార్య నమ్రత పేరు మీద హోటల్ బిజినెస్ ప్రారంభం చేయబోతున్నారు. ఏషియన్ సంస్థ భాగస్వామ్యం లో హైదరాబాదులో లగ్జరీ హోటల్స్ ప్రారంభించి సక్సెస్ అయ్యే థియేటర్ బిజినెస్ మాదిరిగానే భారతదేశం మొత్తం విస్తరింప చేయాలని ఆలోచనలో ఉన్నారట. ఆయన ముందుగా ఏర్పాటు చేస్తున్న రెండు హోటల్స్ పేర్లు కూడా కన్ఫామ్ చేశారు. వాటిలో ఒకటి “మినర్వా ఏ ఎన్ ( ఏషియన్ నమ్రత ) నవంబర్లో, మరొకటి “పాలస్ హైట్స్” డిసెంబర్లో ప్రారంభించనున్నారట.

Advertisement

వీటిలో 1 బంజర హిల్స్ లోని టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉంటుండగా, దీనికి ఇంటీరియర్ వర్క్ నడుస్తుంది. అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న ఈ హోటల్స్ పార్కింగ్ కోసం ఎక్కువ స్పేస్ కేటాయించనున్నారు. ఈ బిజినెస్ సంబంధించి అన్ని విషయాలు నమ్రత దగ్గరుండి చూసుకుందట. మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం 28వ సినిమా త్రివిక్రమ్ తో చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో అతడు, కలేజా, సినిమా వచ్చిన విషయం తెలిసిందే.

also read:

Visitors Are Also Reading