సాధారణంగా పెళ్లి అంటేనే ఓ సందడిగా ఉంటుంది. పెళ్లిలో అందరూ ఎంతో సంతోషంగా డ్యాన్స్‌లు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. రెండు, మూడు రోజుల పాటు జరిగే పెళ్లి పండుగ ఇంట్లో ఉండే ఆ సందడే వేరు. ఇక రెండు మూడు రోజులు ఉందనగానే సందడి ప్రారంభమవుతుంది. ఆటలు, పాటలు, సరదాలు ఇలా పెళ్లి అంటేనే అన్ని ఉంటాయి. పెళ్లి జరిగే రోజు సాయంత్ర వేళలో ఊరేగింపు పెళ్లిలో హైలెట్‌గా నిలుస్తుంది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురును సాగనంపే సమయంలో వారిని ఊరేగిస్తారు. ఇక ఆ సమయంలో డీజే వద్ద చేసే డ్యాన్స్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
Advertisement
కొన్ని ప్రాంతాల్లో అయితే పెళ్లికూతురు డ్యాన్స్ అదిరిపోతే.. కొన్ని ప్రాంతాల్లో పెళ్లి కొడుకు డ్యాన్స్ అదిరిపోతుంటుంది. కొద్ది రోజుల కిందట ఓ పెళ్లి కూతురు బుల్లెట్ బండి పాటకు వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అప్పట్లో ఆ పాటకు పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ ఓ సెన్షేషన్‌గా నిలిచింది. అప్పటి నుంచి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు డ్యాన్స్ చేయకుండా పెళ్లి జరగడం లేదు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతూ చక్కర్లు కొడుతోంది.
Advertisement
మరొక జానపద పాటకు ఊరేగింపులో పెళ్లి కొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ అదిరిపోయింది. ఇప్పుడు ఆ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఊరమాస్‌గా పెళ్లికూతురు, పెళ్లి కొడుకు చేసిన ఈ డ్యాన్స్ కు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. ఏం ఎనర్జీరా బాబు.. ఊర మాస్ డ్యాన్స్ అదుర్స్ అంటూ ఆ వీడియోకు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా ఆలస్యం చేయకుండా ఆ నూతన జంట పెళ్లి డ్యాన్స్ వీడియోను చూసేయండి.
Also Read :
షో ఆఫ్ అవసరమా..? మంచు లక్ష్మి పోస్ట్ పై నెట్టింట దారుణమైన ట్రోల్స్..!
ఒక్కో ఇంటర్వ్యూకు బిత్తిరి సత్తి ఎంత రెమ్యునరేషన్ పుచ్చుకుంటాడో తెలుసా..!