Home » షో ఆఫ్ అవ‌స‌ర‌మా..? మంచు ల‌క్ష్మి పోస్ట్ పై నెట్టింట దారుణ‌మైన ట్రోల్స్..!

షో ఆఫ్ అవ‌స‌ర‌మా..? మంచు ల‌క్ష్మి పోస్ట్ పై నెట్టింట దారుణ‌మైన ట్రోల్స్..!

by AJAY
Ad

మంచు మోహ‌న్ బాబు న‌ట‌వార‌సురాలిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన న‌టి మంచు ల‌క్ష్మి. అమెరికాలో చ‌దువుకున్న మంచు ల‌క్ష్మి అక్క‌డే హాలీవుడ్ సీరియ‌ల్స్ లో న‌టించింది. ఆ త‌ర‌వాత ఇండియాకు షిఫ్ట్ అయ్యింది. ఇక్క‌డకు వ‌చ్చిన కొత్త‌లో టీవీ షోల‌తో పాటూ వ‌రుస సినిమాల్లో న‌టించి ఆక‌ట్టుకుంది. అంతే కాకుండా నిర్మాత‌గా కూడా సినిమాలు చేసింది చేస్తోంది. మంచు ల‌క్ష్మి అన‌గ‌న‌గా ఒక ధీరుడు సినిమాతో ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది.

Advertisement

అంతే కాకుండా గుండెల్లో గోదావ‌రి సినిమాలో హీరోయిన్ గా న‌టించి త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మైమరిపించింది. ఈ సినిమాల‌తో పాటూ మంచు ల‌క్ష్మి చాలా సినిమాలే చేసింది. ప్ర‌స్తుతం త‌మిళ తెలుగు భాష‌ల్లో సినిమాలు చేస్తోంది. అంతేకాకుండా ఇటీవ‌ల ఓ యూట్యూబ్ ఛాన‌ల్ ప్రారంభించి అందులో వీడియోలు చేస్తోంది. ముఖ్యంగా మంచు ల‌క్ష్మి చేసిన మోహ‌న్ బాబు హోం టూర్ వీడియో చాలా వైర‌ల్ అయింది.

Advertisement

ఈ వీడియోకు మిలియ‌న్స్ కొద్దీ వ్య్వూవ్స్ వ‌చ్చాయి. ఇదిలా ఉంటే మంచు ల‌క్ష్మి సోష‌ల్ మీడియాలో కూడా ఎక్కువ యాక్టివ్ గా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. త‌న కూతురి ఫోటోలు త‌న ఫోటోల‌ను మంచు ల‌క్ష్మి సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. సోష‌ల్ మీడియాలో షాలోయింగ్ ఎక్కువ ఉండ‌టంతో మంచు ల‌క్ష్మి పోస్ట్ ల‌పై నెటిజ‌న్లు కూడా కామెంట్లు పెడుతుంటారు.

అయితే తాజాగా మంచు ల‌క్ష్మి త‌న షూ క‌లెక్ష‌న్ ఫోటోను పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కు ఎప్పుడూ స‌రైన షూ ఉండ‌దు అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. అయితే మంచు ల‌క్ష్మి షేర్ చేసిన ఫోటోలో కుప్ప‌లు కుప్ప‌లు గా షూలు ఉండ‌టం అయినా స‌రైన షూ లేద‌ని క్యాప్ష‌న్ ఇవ్వ‌డం తో కొంత‌మంది ట్రోల్ చేస్తున్నారు. అన్ని జ‌త‌ల షూలు ఉన్నాయ‌ని షో ఆఫ్ అవ‌స‌ర‌మా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

 

AlSo ReAd :

25 ఏళ్లుగా హీరో వెంక‌టేష్ రోజా మ‌ధ్య మాట‌లు లేక‌పోవ‌డాన‌కి కార‌ణం అదేనా..?

Visitors Are Also Reading