Home » సమంత పారితోషికం విషయంలో కొత్త కండిషన్స్.. అలా అయితే నా దగ్గరకు రండంటూ..!!

సమంత పారితోషికం విషయంలో కొత్త కండిషన్స్.. అలా అయితే నా దగ్గరకు రండంటూ..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోయిన్ల లో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ సమంత. ఇప్పటికీ ఆమె ఇండస్ట్రీలో బ్యాక్ బ్యాక్ సినిమాలు చేసుకుంటూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.. ఇంతటి స్టార్డంను సంపాదించుకున్న సమంత పారితోషకం విషయంలో కూడా తగ్గేది లేదంటుదట. తాజాగా ఆమె పారితోషికానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆమె ఒక సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తుందని అంటున్నారు.. అయితే కొంతమంది ఇవన్నీ పుకార్లే అని, ఆమె వాస్తవంగా ఎంత తీసుకుంటుందో ఎవరికీ క్లారిటీ లేదని అంటున్నారు.

Advertisement

ALSO READ:చనిపోయేముందు నటుడు రఘువరన్ ఫ్రెండ్స్ ను పిలిచి ఎందుకు పార్టీ ఇచ్చారు..?

Advertisement

కానీ ఈ క్రమంలో సమంతనే దీనికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తోంది. ప్రస్తుతం సమంత సినిమాల్లో మంచి బలమైన కథ ఉంటేనే నటిస్తోంది.. మామూలు సినిమాలతో పాటుగా, పాన్ ఇండియా లెవెల్ లో కూడా నటించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో రెమ్యూనరేషన్ విషయంలో కొత్త కండిషన్స్ కూడా పెడుతుందట. సమంత ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటారు అనే దానిపై కొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. అయితే ఆమె ఒక్క సినిమాకు నాలుగు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తోందని, చిన్న సినిమాలు అయితే 3.5 కోట్ల వరకు అడుగుతోందని,

ఇది ఆమెకు మినిమం రెమ్యూనరేషనే అని, ఒకవేళ అంతకంటే తక్కువ ఇస్తానంటే అసలు సినిమా చేయనని కండిషన్స్ పెడుతోందట. ఈ విధమైన కండిషన్స్ కు నిర్మాతలు కూడా ఓకే అనడం విశేషం. దీనికి ప్రధాన కారణం ఈమెకు ఉన్న ఇమేజ్.. ఆమె రేంజ్ కు తగ్గట్టుగా అడుగుతోందని చాలా మంది అభిమానులు కూడా అంటున్నారు. ఈ క్రమంలోనే రష్మిక, పూజా హెగ్డే వంటి హీరోయిన్లకు దీటుగా పారితోషకం అందుకుంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ అమ్మడు కుషి, శాకుంతలం, యశోద, చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు పుష్ప 2లో కూడా కనిపించబోతుందని సమాచారం.

ALSO READ:ప‌రిగ‌డుపున ఈ పండు తింటే చాలు.. లాభాలు ఎన్నో..!

Visitors Are Also Reading