Home » జవాన్ ట్రైలర్ లో షారూఖ్ చెప్పిన డైలాగ్ కి.. ఆ విషయానికి లింక్ ఉందా ? నెటిజన్స్ ఏమంటున్నారంటే ?

జవాన్ ట్రైలర్ లో షారూఖ్ చెప్పిన డైలాగ్ కి.. ఆ విషయానికి లింక్ ఉందా ? నెటిజన్స్ ఏమంటున్నారంటే ?

by Anji
Ad

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్, హీరోయిన్ నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ జవాన్. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సాంగ్స్ అండ్ ట్రైలర్ కట్ వీడియోలను విడుదల చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ లోని ఓ డైలాగ్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా “ నా కొడుకు మీద చేయి వేసే ముందు.. వాడి బాబు మీద చేయి వెయ్యి ” అనే డైలాగ్ పాపులర్ అయింది. 

Advertisement

నిజజీవితంలో షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ Draగ్స్ విషయంలో జైలుకు వెళ్లిన విషయం విధితమే. కొన్నాళ్లు ఆర్యన్ ఖాన్ జైలు జీవితాన్ని కూడా గడిపి బయటికీ వచ్చాడు. ఈ విషయాన్ని నెటిజన్లు ఈ డైలాగ్ కి సింక్ చేస్తున్నారు. ఆ కేసులో ఆర్యన్ ఖాన్ ని అరెస్టు చేసిన మాజీ యాంటీ Draగ్స్ అధికారి సమీర్ వాంఖడే కి షారూఖ్ డైరెక్ట్ మెసేజ్ ఇచ్చాడంటూ.. కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ డైలాగ్ సెన్షేషన్ అవుతోంది. ట్రైలర్ విషయానికొస్తే.. యాక్షన్ సీక్వెన్సెస్, మాస్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 

Advertisement

దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ ట్రైలర్ ని యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్ వేదికలో దాదాపు 11 కోట్ల మంది వీక్షించడం విశేషం. యూట్యూబ్ లో ఇది ఓ సంచలనం అంటూ తెలియజేశారు జవాన్ మూవీ మేకర్స్. జవాన్ ట్రైలర్ సోషల్ మీడియాలో నెంబర్ వన్ లో ట్రెండ్ అవుతోంది.  ప్రధానంగా ట్రైలర్ లో షారూఖ్ డైలాగ్స్, యాక్షన్స్, విజువల్స్ ప్రేక్షులకు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో షారూఖ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో సెప్టెంబర్ 07న ఈ సినిమాను విడుదల కాబోతుంది. పఠాన్ మాదిరిగా జవాన్ సక్సెస్ సాధిస్తుందో లేదో అనేది తెలియాలంటే మాత్రం ఈనెల 07 వరకు వేచి ఉండాల్సిందే..!

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

OG Glimpse : అదిరిపోయిన ఓజీ గ్లింప్స్‌.. పవన్ ఫ్యాన్స్ కు పండగే

చిరంజీవి రాఖీ పండుగ రోజు ధరించిన వాచ్ విలువ అన్ని కోట్లా ?  ఫొటోలు వైరల్ 

Visitors Are Also Reading