Home » పల్లవి ప్రశాంత్ చేసిన పనికి నెటిజన్స్ షాక్.. ఏం చేశాడంటే..?

పల్లవి ప్రశాంత్ చేసిన పనికి నెటిజన్స్ షాక్.. ఏం చేశాడంటే..?

by Anji

రైతు బిడ్డగా బిగ్ బాస్ సీజన్ 7 లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ విజేతగా గెలిచి.. సంచలనం సృష్టించాడు. బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా గెలిచిన ప్రశాంత్.. రూ. 35 లక్షలు క్యాష్ ప్రైజ్, 25 లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్, ఒక కారు గెలుచుకున్నాడు.

ఈ సందర్భంలో తన విన్నింగ్ అమౌంట్ అంతా పేద రైతుల కోసం ఖర్చు చేస్తానని ప్రశాంత్ హామీ ఇచ్చాడు ప్రశాంత్. అయితే సీజన్ పూర్తయ్యి మూడు నెలలు కావస్తున్న దాని గురించి ఊసేలేకపోవడంతో ప్రశాంత్ పై తెగ విమర్శలు వచ్చాయి. షోలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు.. మాట తప్పాడు అంటూ ట్రోల్ చేశారు. ఇక ఈ రూమర్స్ ను తిప్పికొట్టేలా.. తన తొలి సహాయం చేశాడు ప్రశాంత్. ఓ పేద కుటుంబానికి అండగా నిలిచాడు.

గజ్వేల్ లోని కొలుగూరి గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశాడు. అంతే కాదు ఏడాదికి సరిపడ బియ్యం కూడా అందజేశాడు. ప్రశాంత్ కు తోడుగా సందీప్ మాస్టర్ కూడా 25 వేల రూపాయల సాయం అందించాడు. ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు ప్రశాంత్. “మీ ప్రోత్సాహంతో ఇలాంటివి మరిన్ని చేస్తానని.. తాను గెలుచుకున్న మిగతా డబ్బు కూడా పేద ప్రజల కోసమే వాడతానని తెలిపాడు.

Also Read :  మా తండ్రి వల్లనే ఇంట్లో నుంచి పారిపోయాను.. రవి కిషన్ కామెంట్స్ వైరల్..!

Visitors Are Also Reading