Home » కనీసం నీ భర్తకు అయినా విలువ ఇవ్వు….యాంకర్ శివజ్యోతి పై నెటిజన్ ఫైర్…!

కనీసం నీ భర్తకు అయినా విలువ ఇవ్వు….యాంకర్ శివజ్యోతి పై నెటిజన్ ఫైర్…!

by AJAY
Ad

శివజ్యోతి అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తీన్మార్ వార్తల ద్వారా శివజ్యోతి ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. తెలంగాణ యాసలో వార్తలు చెబుతూ బిత్తిరి సత్తితో కలిసి శివజ్యోతి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. సాధారణంగా వార్తలు చూడాలంటే ఎవరైనా బోర్ గా ఫీల్ అవుతారు. కానీ శివాజ్యోతి తనదైన స్టైల్ లో వార్తలు చెప్పడం వల్ల చాలామంది తీన్మార్ వార్తలు షో కు ఫిదా అయిపోయారు.

Shivajyothi

Shivajyothi

అయితే తీన్మార్ వార్తలు షో లో శివజ్యోతి ఎంతో పద్ధతిగా…. పక్కా తెలంగాణ అమ్మాయిలా కనిపించింది. కానీ ఆ తర్వాత శివజ్యోతి బిగ్ బాస్ రియాలిటీ షో లో అడుగుపెట్టింది. ఇక బిగ్ బాస్ షోలో అడుగుపెట్టిన తర్వాత శివజ్యోతి ఎంతో స్టైల్ గా మారిపోయింది. ధరించే దుస్తుల విషయంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం మొదలుపెట్టింది.

Advertisement

Advertisement

ఇక సోషల్ మీడియాలో శివజ్యోతి చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఫోటో షూట్ లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అయితే ఒకప్పుడు శివజ్యోతిని అభిమానించిన వారు సైతం ఇప్పుడు ఆమె తీరు చూసి విమర్శలు కురిపిస్తున్నారు. రీసెంట్ గా శివజ్యోతి ఓ ఫోటో ను షేర్ చేసింది. కాగా ఆ ఫోటోలో నుదిటిన బొట్టు…. మెడలో తాళి కనిపించలేదు.

దాంతో ఓ నెటిజన్ ఫైర్ అయ్యాడు. “కనీసం నీ భర్తకు అయినా విలువ ఇవ్వు… మెడలో తాళి లేదు… స్టైల్ గా ఉండే బొట్టు అయినా పెట్టుకో స్టైల్ గా ఉండే బొట్టు ట్రెండ్… మనం ట్రెండ్ సెట్ చేయాలి.” అంటూ కామెంట్ పెట్టాడు. దాంతో కొంతమంది శివజ్యోతికి సపోర్ట్ చేస్తుండగా… మరి కొంతమంది నెటిజన్ కు సపోర్ట్ చేస్తున్నారు.

Also read : వరుస సినిమాల్లో అల్లు అర్హ.. పవన్ కళ్యాణ్ సినిమాలోనూ ?

Visitors Are Also Reading