గత మూడు సంవత్సరాల నుంచి ఊరిస్తూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య. ఈ మూవీ ఎట్టకేలకు ఈనెల 29న థియేటర్లలోకి వస్తోంది. దీనికి అనేక స్పెషాలిటీస్ ఉన్నాయి. చిరంజీవి హీరోగా నటించిన సైరా తర్వాత ఈ మూవీ వస్తోంది. మొదటిసారిగా తండ్రీకొడుకులు తెరపై ఎక్కువ సమయం నటించిన సినిమా ఇది. ఈ మూవీలో చిరంజీవికి జోడిగా కాజల్, రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే కథానాయకులు ఉన్నారు. ఈ మూవీ కొరటాల శివ డైరెక్షన్లో భరత్ మూవీ చేసిన 4 సంవత్సరాల తర్వాత వస్తోంది. ఇందులో విలన్ గా సోనూసూద్ ప్రత్యేకంగా
Advertisement
కనిపించనున్నారు. ఇలా ఎన్నో క్వాలిటీస్ ఉన్నా ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఇక రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో ఘన విజయం అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నారు. నెలన్నర వ్యవధిలోనే చెర్రీ మరోసారి ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీంతో మెగా అభిమానులకు పండగ చేసుకున్నంత ఆనందంగా ఉంది. ఇన్ని క్వాలిటీస్ ఉన్నా బ్యాడ్ సెంటిమెంట్ కు ఆచార్య మూవీ లింకు పెట్టి సినిమాపై కొంతమంది నెగిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇదే రాజమౌళి సెంటిమెంట్. ఏ హీరో అయినా రాజమౌళి డైరెక్షన్
Advertisement
లో మూవీ చేస్తే బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. ఆ వెంటనే ఎంత పెద్ద డైరెక్టర్ తో ఎంత మంచి అంచనాలతో సినిమా చేసిన అది ఫ్లాప్ అవడం కామన్ అయిపోయింది. రాజమౌళి యొక్క 12 మూవీస్ చూస్తే ఏ హీరోతో చేసినా అది సూపర్ హిట్. ఇంకా చెప్పుకుంటే రాజమౌళి చేతిలో పడ్డా ఏ హీరో అయినా ఇంత పెద్ద హిట్ కొట్టిన ఆ తర్వాత హిట్ కోసం మాత్రం చాలా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరి ఇప్పుడు అదే సెంటిమెంట్ ఆచార్య మూవీ కూడా వర్తిస్తుందా. లేదా ఆ సెంటిమెంటును మూవీ బ్రేక్ చేస్తుందా అనేది మనం చూడాల్సిన విషయం.
ఇవి కూడా చదవండి:
ఎన్టీఆర్ కొండవీటి సింహంలో చిరును తప్పించి మోహన్ బాబుకు ఛాన్స్…తెరవెనక కథ ఇదే..!
కృష్ణ ఫ్యాన్స్ నన్ను కొట్టడానికి వచ్చారన్న మురళీమోహన్.. ఆ సీన్ వల్లేనా..!!
దాని వల్ల ఆరేళ్ల పాటు బాధపడ్డా…నెటిజన్లతో సమంత ఎమోషనల్ కామెంట్స్…!