Telugu News » దాని వల్ల ఆరేళ్ల పాటు బాధపడ్డా…నెటిజన్లతో సమంత ఎమోషనల్ కామెంట్స్…!

దాని వల్ల ఆరేళ్ల పాటు బాధపడ్డా…నెటిజన్లతో సమంత ఎమోషనల్ కామెంట్స్…!

by AJAY MADDIBOINA

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత కూడా అదే జోష్ తో సినిమాలు చేస్తోంది. సమంత గతంలో కంటే ఎక్కువ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు గ్లామర్ డోస్ కూడా పెంచేసిన‌ట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం సమంత తెలుగు తమిళ భాషల్లోనే కాకుండా బాలీవుడ్ లోనూ సినిమా ఆఫర్లను అందుకుంటుంది. ఇప్పటికే సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఓ బాలీవుడ్ సినిమాలో అవకాశం వచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Ads

మరోవైపు సమంత ఇప్పటికే తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా నటించిన కాతు వాక్కుల రెండు కాదల్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. మరోవైపు స‌మంత తెలుగులో శాకుంత‌లం అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సమంత ముందు నుండి సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

Samantha

Samantha

విడాకుల‌ తర్వాత కూడా సమంత సోషల్ మీడియాలో అదేవిధంగా యాక్టివ్ గా ఉంటుంది. సమయం దొరికిన‌ప్పుడు నెటిజ‌న్ల‌తో ముచ్చటిస్తూ కాలక్షేపం చేస్తుంది. తాజాగా సమంత మ‌రోసారి నెటిజన్ల‌తో ముచ్చ‌టించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. సమంత త‌న చెవుల‌కు రెండు మూడు క‌మ్మ‌లు కుంటించుకుంది. ఇదే విషయంపై నెటిజ‌న్లు స‌మంత‌ను ప్రశ్నించారు.

samantha

samantha

దాంతో స‌మంత‌… దాదాపు ఆరు నెలల పాటు చెవి నొప్పితో బాధ పడ్డాను అని తెలిపింది. రెండు మూడు చోట్ల క‌మ్మ‌లు కుట్టించుకోవ‌డం వల్ల అలా జరిగిందేమో అని సమాధానమిచ్చింది. మరోవైపు తన ఒంటిపై ఉన్న టాటూల‌పై కూడా స‌మ‌యంత‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇక పై త‌న‌కు టాటూలు వేయించుకునే ఉద్ద్యేశం లేద‌ని తెలిపింది. మీరు కూడా అలాంటి ఆలోచ‌న‌లు ఉంటే మానుకోవాలని నెటిజ‌న్ల‌కు స‌లహా ఇచ్చింది.

ALSO READ : 

మోహన్ బాబు చేయాల్సిన ‘హిట్లర్’ సినిమా చిరంజీవి ఎందుకు చేసారు ? వెనుకున్న స్టోరీ ఇదే..!

సింహాద్రి, ఖుషి, దూకుడు సినిమాలు ఇండస్ట్రీ హిట్ కాదా ? ఇందులో నిజమెంత ?

 


You may also like