Home » ఓటీటీలో నవదీప్ కొత్త వెబ్ సిరీస్.. మాయాబజార్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ఓటీటీలో నవదీప్ కొత్త వెబ్ సిరీస్.. మాయాబజార్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

by Anji
Ad

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రకరకాలుగా చోటు చేసుకుంటున్నాయి. సినిమాని థియేటర్ల తో సంబంధం లేకుండా సినీ తారలు ఒక్కొక్కరూ ఓటీటీల బాట పడుతున్నారు. అగ్ర హీరోలు, హీరోయిన్లు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ సినిమాలు, సిరీస్ లపై ఇంట్రెస్ట్ చూపించడం విశేషం. హీరో నవదీప్ కొద్ది రోజుల కిందట న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించాడు. మీడియా రంగంలోని కొత్త పోకడలను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కిన ఈ సిరీస్ సూపర్ హిట్ సాధించింది.  

Advertisement

ఇప్పుడు అతను మరోసారి డైరెక్ట్ గా ఓటీటీ ఆడియెన్స్ ని పలకరించనున్నాడు. నవదీప్ నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ మాయా బజార్.. ఫర్ సేల్ అనేది ట్యాగ్ లైన్. తెలుగు అమ్మాయి ఈషారెబ్బా హీరోయిన్ గా నటిస్తోంది. అదేవిధంగా ఝాన్సీ, మెయంగ్ చంగ్, కోట శ్రీనివాసరావు, సునైన, హరితేజ, రాజా చెంబోలు, రవివర్మ తదితర ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మాయాబజార్ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో జులై 14 నుంచి మాయాబజార్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ కి గౌతమి చల్లగుల్ల దర్శకత్వం వహించారు. దగ్గుబాటి రానా స్పిరిట్ మీడియా బ్యానర్, మిరాజ్ బ్యానర్ తో కలిసి రాజీవ్ రంజన్ ఈ సిరీస్ ను నిర్మించారు.

Advertisement

తాజాగా విడుదలైన ఈ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ముఖ్యంగా మాజాబజార్ అనే గేటెడ్ కమ్యూనిటీలో కుటుంబాలు ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయో అనే విషయాన్నీ కామెడీ కోణంలో చూపించారు. కొందరూ పిల్లులను పెంచుకుంటే.. మరికొందరూ ఆవులను పెంచుతుంటారు. ఒక ఇంటి ఆవిడ అయితే అనుమానంతో గొడవ పడుతూనే ఉంటుంది. కొందరూ చాదస్తంగా మాట్లాడుతుంటారు. వీరిందరూ కలిసి ఉండే కమ్యూనిటీని ప్రభుత్వ అనుమతి లేని ప్రాంతంలో నిర్మించి ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు మాయాబజర్ గేటెడ్ కమ్యూనిటీలో ఇండ్లను కూల్చివేయాలని బుల్డోజర్స్ తో వస్తారు. ఇక ఆ తరువాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేది తెలియాలంటే మాత్రం జులై 14న జీ5లో స్ట్రీమింగ్ కానున్న మాయా బజార్ సిరీస్ వీక్షించాల్సిందే. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

అక్కినేని హీరోల పేర్ల ముందు ‘నాగ’ అని ఎందుకు ఉంటుందో తెలుసా…?

సింగర్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నటులు వీళ్లే ..!

కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ హీరోగా సినిమా.. ఫస్ట్ లుక్ అదిరిందిగా!

Visitors Are Also Reading