Home » నరేష్ పవిత్ర మెడలో మూడు ముళ్ళు వేస్తారా..? రమ్య పరిస్థితేంటి..?

నరేష్ పవిత్ర మెడలో మూడు ముళ్ళు వేస్తారా..? రమ్య పరిస్థితేంటి..?

by Sravanthi Pandrala Pandrala
Ad

మూడు పెళ్లిళ్ల ముద్దుల రాకుమారుడు, నాలుగో పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటాను అంటున్నారు. రెండు పెళ్లిళ్ల ఆమె నరేష్ మూడు ముళ్ళు వేస్తే మూడో పెళ్లి చేసుకుంటానని అంటున్నారు. ఈ విధంగా ఇద్దరి ఎపిసోడ్లు కొన్ని నెలల నుంచి సీరియల్ లాగా కొనసాగుతూ వస్తున్నాయి. ఈ సీరియల్ రియాలిటీ కథలో ఎన్నో మలుపులు, ఎన్నో ట్విస్టులు, మధ్యమధ్యలో యాడ్స్ ఈ విధంగా ఈ సీరియల్ రోజుకో కొత్త మలుపు తిరుగుతూ అందరికీ ఉత్కంఠ రేపుతోంది. ఈ సీరియల్ కథలోకి మళ్లీ కొత్తగా ఎంట్రీ ఇచ్చింది మరో క్యారెక్టర్ రమ్య రఘుపతి. ఈమె నరేష్ మూడో భార్య, ఈమె రంగంలోకి దిగాక నరేష్ పవిత్ర లోకేష్ సీరియల్ కథ మరింత రసవత్తరంగా కొనసాగుతోంది. వస్తా నీ వెనక అంటూ రమ్య రఘుపతి నరేష్ ను వెంటాడుతోంది. కానీ నరేష్ ఏమో ఆమెతో ప్రాణహాని ఉందని, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తోందని, రమ్యపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ తరుణంలో నరేష్ మరియు రమ్య రఘుపతి ఒక ఫ్రెండ్షిప్ బాండ్ కొనసాగిస్తున్నామని అన్నారు.

Advertisement

వీరిద్దరి మధ్య స్నేహమే ఉంటే ఇద్దరు కలిసి హోటల్లో ఒకే గదిలో రాత్రిపూట ఏ విధంగా ఉంటారని, అలా ఉండాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తోంది రమ్య రఘుపతి. వీరిద్దరు సీక్రెట్ గా మైసూరులోని ఒక హోటల్ గదిలో ఉన్నప్పుడు ఆమె వెళ్ళి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య నడుస్తున్న ఈ వ్యవహారం అంతా రచ్చకెక్కింది. ఈ తరుణంలోనే పవిత్ర లోకేష్ నేను నరేష్ తో సహజీవనం చేస్తున్నారని చెప్పినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇన్ని ట్విస్టుల మధ్య వీరిద్దరు ఒకటవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. నరేష్ మూడో భార్య రమ్య విషయానికి వస్తే చాలాకాలం నుంచి నరేష్ తో విడిపోయి విడివిడిగా ఉంటున్నారు. ఈ తరుణంలోనే నరేష్ పవిత్ర కలిసి ఉంటున్నారని అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ మధ్యకాలంలో వీరిద్దరు కలిసి మహాబలేశ్వరం దేవాలయంలో పూజలు కూడా చేశారు.

Advertisement

ఈ తరుణంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే తనకు విడాకులు ఇవ్వకుండా నరేష్ పవిత్ర ఏ విధంగా పెళ్లి చేసుకుంటారని రమ్య ప్రశ్నిస్తోంది. అయితే పవిత్ర లోకేష్ మాత్రం నేను ఎప్పటినుంచో నరేష్ కుటుంబంతో కలిసి ఉంటుందని చెప్పుకొస్తోంది. అసలు రమ్య మమ్మల్ని ఇలా ఎందుకు చేస్తుందో నాకు అర్థం కావడం లేదని అంటోంది పవిత్ర. ఈ విధంగా నరేష్ పవిత్ర లోకేష్ కి మధ్య జరిగే వ్యవహారం సీరియల్ డ్రామాను తలపిస్తోంది. మరి ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో..? ఎంతమంది ఇందులోకి ఎంటర్ అవుతారో..? మరి నరేష్ పవిత్ర ని పెళ్లి చేసుకుంటారా..? రమ్య రఘుపతి శాంతిస్తుందా..? ఈ వ్యవహారానికి ఎండ్ కార్డు పడేది ఎప్పుడు..? అనే విషయాలకు సమాధానం మాత్రం ఇప్పట్లో దొరకేటట్టు.. మరి ఈ విషయం చిలికిచిలికి ఏ విధంగా మారుతుందో అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది.

also read;

Visitors Are Also Reading