Home » మ‌హేశ్ బాబు త్రివిక్ర‌మ్ ల‌కు పూజా హెగ్డే కండిష‌న్స్…అవేంటంటే..!

మ‌హేశ్ బాబు త్రివిక్ర‌మ్ ల‌కు పూజా హెగ్డే కండిష‌న్స్…అవేంటంటే..!

by AJAY
Ad

ఫుల్ బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్స్ లో పూజ హెగ్డే ఒకరు. రీసెంట్ గా పూజా హెగ్డే రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ లాంటి బ‌డా సినిమాలతో ముందుకు వచ్చింది. అయితే ఈ మూడు సినిమాలు కూడా పూజ హెగ్డే కు నిరాశే మిగిల్చాయి. వ‌రుస‌గా మూడు ఫ్లాప్ లు ప‌డిన‌ప్ప‌టికీ పూజా హెగ్డే క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అంతే కాకుండా మ‌రికొన్ని ప్రాజెక్ట్ లు కూడా పూజా త‌లుపు త‌డుతున్నాయి.

Advertisement

పూజ హెగ్డే టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ మరియు బాలీవుడ్ లో సైతం సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న కబీ ఈత్ కబీ దివాలి సినిమా షూటింగ్ బిజీగా ఉంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో సర్కస్ అనే సినిమాలో నటించబోతోంది. అంతేకాకుండా పూజ హెగ్డే టాలీవుడ్ లో జనగణమన మరియు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న‌ ssmb 28 సినిమాలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

Advertisement

అయితే బిజీ షెడ్యూల్ నేపథ్యంలో పూజా హెగ్డే మహేష్ త్రివిక్రమ్ సినిమాకు కండిషన్స్ పెట్టినట్టు తెలుస్తోంది. వ‌రుస‌ సినిమాలతో బిజీగా ఉన్నందున కేవలం 45 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ డేట్స్ లో తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయాలని మేకర్స్ కు చెప్పినట్టు తెలుస్తోంది.

ఇక ఈ విషయం తెలిసిన తర్వాత మహేష్ బాబు అభిమానులు పూజ పై ఫైర్ అవుతున్నారు. మహేష్ బాబు సినిమా కే కండిషన్స్ పెడుతుంతా అంటూ బుట్ట‌బొమ్మ పై మండిపడుతున్నారు. మ‌రోవైపు పూజాహెగ్డే అభిమానులు చాలా బిజీగా ఉంది కాబ‌ట్టే కండిష‌న్స్ పెట్టాల్సి వ‌చ్చిందని అర్థం చేసుకోవాలి క‌దా అంటూ పూజాను వెన‌కేసుకొస్తున్నారు.

ALSO READ : “ఫిదా” సినిమాలో ఈ మిస్టేక్ ను గ‌మించారా..? శేఖ‌ర్ క‌మ్ముల ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్స‌య్యారు సార్..!

Visitors Are Also Reading