Home » ఆ హీరోయిన్ తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న నరేష్.. కారణం ఏంటంటే..?

ఆ హీరోయిన్ తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న నరేష్.. కారణం ఏంటంటే..?

by Anji
Ad

ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా అల్లరి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అదే పేరుని తన ఇంటి పేరుగా మార్చుకున్న అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కామెడీ టైమింగ్ తో ఎన్నో సినిమాలను సూపర్ హిట్ చేసి తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న ఈయన ఎప్పుడూ కామెడీ సినిమాలే చేస్తే.. చూసే జనాలకు బోరు కొడుతుందని అప్పుడప్పుడు గమ్యం లాంటి గుర్తుండిపోయే పాత్రలు కూడా చేశారు. ఇప్పుడైతే కామెడీ జానర్ ని పూర్తిగా పక్కకు పెట్టి, నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ మరింత ముందుకు వెళుతున్నారు నరేష్.

Advertisement

అంతేకాదు ఇలా కంటెంట్ సినిమాలతోనే హిట్స్ అందుకుంటున్నాడు.  తాజాగా  నాగార్జున హీరోగా నటిస్తున్న నా సామిరంగా అనే సినిమాలో అల్లరి నరేష్ అంజి అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ పాత్ర గురించి డైరెక్టర్ చెబుతూ గమ్యం తర్వాత అల్లరి నరేష్ పేరు 50 రెట్లు మారుమ్రోగుతుంది అంటూ వెల్లడించారు. ఈ క్రమంలోనే అల్లరి నరేష్ కు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ గా మారుతున్నాయి .అందులో భాగంగానే అల్లరి నరేష్ సాధారణంగా ఒక సినిమాలో చేసిన హీరోయిన్ తో మరోసారి సినిమా చేసే అలవాటు లేదు. కానీ ఫర్జానా అనే హీరోయిన్ తో ఏకంగా మూడు నుండి నాలుగు సినిమాలు చేశారు నరేష్.

ఇక అలా అల్లరి నరేష్ ఫర్జానా మధ్య అలాంటి రూమర్స్  ఎన్నో సృష్టించారు. కొన్ని వెబ్ సైట్స్ అయితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని కూడా వార్తలు రాశారు. ఇది చూసిన ఈ వీవీ సత్యనారాయణ ఎవరు రా నా కోడలు.? ఇంటికి తీసుకొని రా చూద్దామంటూ సరదాగా అనేవారట. ఇక తర్వాత వీరి మధ్య బ్రేకప్ అయిందని వార్తలు కూడా వినిపించాయి. ఇక దీనిపై అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. సాధారణంగా హీరోయిన్స్ షూటింగ్ వచ్చేటప్పుడు ఎవరైనా తమ తల్లిదండ్రులను వెంటబెట్టుకొని లొకేషన్ కి వచ్చేవాళ్ళు. కానీ ఆమె మాత్రం తన బాయ్ ఫ్రెండ్ ను వెంట పెట్టుకొని షూటింగ్ స్పాట్ కి వచ్చేది. ఇలా కమిట్ అయిన అమ్మాయితో మళ్లీ నాకు కొత్తగా ప్రేమాయణం ఏంటి అంటూ తెలిపారు అల్లరి నరేష్. మొత్తానికి తనపై వచ్చిన రూమర్స్ కి గట్టి క్లారిటీనే ఇచ్చారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading