Home » నరేష్, పవిత్రా లోకేశ్ ‘మళ్లీ పెళ్లి’ ముహుర్తం ఖరారు.. ఎప్పుడంటే ?

నరేష్, పవిత్రా లోకేశ్ ‘మళ్లీ పెళ్లి’ ముహుర్తం ఖరారు.. ఎప్పుడంటే ?

by Anji
Ad

టాలీవుడ్ సీనియర్ నటులు నరేష్, పవిత్రా లోకేష్ పేర్లు గత కొద్ది రోజులుగా సోసల్ మీడియాలో తరుచూ వినిపిస్తున్న విషయం తెలిసిందే. వీరి ప్రేమాయణం, పెళ్లి గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చకే దారి తీసింది. కొత్త ఏడాది రోజు తాము ఇద్దరం కొత్త జీవితం ప్రారంభిస్తున్నామంటూ ఓ వీడియోను విడుదల చేస అధికారికంగా తమ ప్రేమను ప్రకటించారు నరేష్, పవిత్ర. 

Advertisement

దీంతో వీరి ప్రేమ, పెళ్లి వాస్తవమే అనుకున్నారు అంతా. ఇది జరిగి కొద్ది రోజుల తరువాత పెద్ద ట్వీస్ట్ ఇచ్చారు. తమ నెక్ట్స్ మూవీ కోసం ఈ వీడియో చేశారని తెలిపింది. మళ్లీ పెళ్లి అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీని ప్రముఖ సీనియర్ దర్శక, నిర్మాత ఎం.ఎస్.రాజు తెరకెక్కిస్తున్నారు. ఇటీవల టీజర్ ని కూడా రిలీజ్ చేశారు  మేకర్స్. రమ్య రఘుపతితో గొడవలు.. ఆమె మీడియా ముందుకొచ్చి చేసిన ఆరోపణలు హోటల్ లో నరేష్, పవిత్రా లోకేష్ దొరికిపోవడం వంటి సన్నివేశాలన్నింటినీ టీజర్ లో యథావిధిగా చూపించారు. మళ్లీ పెళ్లి సినిమా నరేష్, పవిత్రల బయోపిక్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Advertisement

 

నరేష్, పవిత్రల రీల్ లైఫ్ లో జరిగిన సంఘటనలనే మళ్లీ పెళ్లి మూవీతో తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు నరేష్. విజయకృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ స్వయంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. నరేష్, పవిత్రలతో పాటు జయసుధ శరత్ బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్, యండమూరి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. అదేవిధంగా ఎం.ఎన్.బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ.. జునైద్ సిద్ధిక్ ఎడిటర్ గా వ్యవహరించగా అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. 

Also Read :   ఇరవై ఏళ్ల సినీ కెరీర్ లో అల్లరి నరేష్ కి ఫస్ట్ మాస్ హిట్.. ఉగ్రంకి పాజిటివ్..!

Visitors Are Also Reading