Home » రాజకీయాల్లోకి జూ. ఎన్టీఆర్… ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

రాజకీయాల్లోకి జూ. ఎన్టీఆర్… ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

by Bunty
Published: Last Updated on
Ad

నారా వారి కుటుంబం తరపున హీరోగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నారా రోహిత్ కొన్నాళ్లుగా సిల్వర్ స్క్రీన్ దూరంగా ఉంటున్నాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ నారా రోహిత్ కి సరైన సినిమా పడలేదనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఏపీలో నారా లోకేష్ యువగలం పాదయాత్రలో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలని కవర్ చేస్తూ లోకేష్ పాదయాత్ర పూర్తి చేశారు.

READ ALSO :  భర్త వేరే అమ్మాయితో… తిరుగుతున్నప్పుడు భార్య ఏం చేయాలి..!

Advertisement

 

ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. మొదట్లో పాదయాత్రకు ప్రజాస్పందన పెద్ద ఎత్తున రాలేదు గాని, ఇప్పుడు మంచి స్పందన వస్తుంది. లోకేష్ సైతం ప్రజలతో మమేకం అవుతున్నారు. ఇదే సమయంలో తాజాగా నారా రోహిత్, లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు నారా రోహిత్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నారా రోహిత్ వైసిపిపై విమర్శలు చేశారు.

Advertisement

READ ALSO : కోలీవుడ్ స్టార్ హీరో తో మీనా రెండో పెళ్లి..?

జూ ఎన్టీఆర్ కు లోకేష్ కంగ్రాట్స్ - వాటికి సమాధానంగానే : తొలి అడుగు పడినట్లేనా...!! | TDP leader Nara lokesh wishes Jr NTR over RRR success,thus putting an end to controversies - Telugu ...

రాష్ట్రంలో వైసిపి డిఫెన్స్ లో పడిందని, అందుకే తెలుగుదేశం పార్టీపై బురద జల్లుతున్నారని ఫైర్ అయ్యారు. యువగలం పాదయాత్ర ముందు ముందు ప్రభంజనం రేపుతుందని యువత రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చిన రోహిత్… జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై కూడా కామెంట్ చేశారు. అవసరమైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం రాజకీయాల్లోకి వస్తారని, అలాగే లోకేష్ పాదయాత్రకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

READ ALSO :  AP Govt Jobs 2023 : ఏపీలో 5,388 వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీ… పూర్తి వివరాలు ఇవే..!

Visitors Are Also Reading