Home » ఫేస్ బుక్ ప్రేమపై షాకింగ్ విషయాలు చెప్పిన నాని.. అమ్మాయి తరఫున వాళ్లు భయపడ్డారట..!!

ఫేస్ బుక్ ప్రేమపై షాకింగ్ విషయాలు చెప్పిన నాని.. అమ్మాయి తరఫున వాళ్లు భయపడ్డారట..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్న నాచురల్ స్టార్ నాని అంటే తెలియని వారు ఉండరు. ఆయన ఏ సినిమా తీసిన సింపుల్ గా న్యాచురల్ గా ఉంటుంది కాబట్టే ఆయనకు న్యాచురల్ స్టార్ నాని అన్నారు. అలాంటి హీరో తన నిజ జీవితంలో కూడా కొన్ని విషయాలను బయట పెట్టేసారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం..? నాని 2012లోనే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అలాంటి ఇలాంటి లవ్ మ్యారేజ్ కాదు. ఫేస్బుక్ ద్వారా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆయన. ఇరు కుటుంబాలను కూడా ఒప్పించి అందరి సమక్షంలోనే వివాహం చేసుకున్నారట. అప్పట్లో నాని పెళ్లి గురించి వార్తలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి.

నాని ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారని వార్తలు రావడాన్ని నాని కొట్టిపారేశారు తన ప్రేమ పెళ్లి గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఆయన కొత్త సినిమా అంటే సుందరానికి విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ మూవీ కూడా మంచి హిట్ కొడుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తన రియల్ లైఫ్ లో నీ ప్రేమ కథను ఆయన చెప్పుకొచ్చారు. మా మ్యారేజ్ ఇంటర్ క్యాస్ట్ కాదు. మా ప్రేమ వివాహంలో మేము పెద్ద ఇబ్బందులను కూడా ఎదుర్కోలేదు. ఫేస్బుక్ ద్వారా పరిచయమై ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్నాం. కానీ అమ్మాయి తరపు వాళ్ళే నా విషయంలో కాస్త టెన్షన్ పడ్డారు. ఎందుకంటే అప్పుడే నేను హీరో గా ఇండస్ట్రీలో ఎదుగుతున్నాను.

Advertisement

Advertisement

హీరోగా సక్సెస్ అవుతానో, అవ్వనో కూడా తెలియదు. అలాంటి వ్యక్తికి ఎలా ఇవ్వాలి అని వాళ్ల ఫ్యామిలీ కాస్త ఆలోచించిదట ఈ కారణంగానే ముందు వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోలేదు. ఎప్పుడైతే వాళ్ళు నన్ను వచ్చి కలిశారో.. నాతో మాట్లాడిన తర్వాత వారికి నమ్మకం కుదిరింది. అప్పుడు ఇరువైపుల వారు ఒప్పుకొని మా మ్యారేజ్ చేశారు అని క్లారిటీ ఇచ్చారు నాని. ఇక అంటే సుందరానికి సినిమా విషయానికి వస్తే వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో మైత్రి మూవీ నిర్మాణ సంస్థ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేటర్ లోకి రాకముందే పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దీంతో మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ALSO READ;

రామ్ గోపాల్ వర్మ తన కూతురిని చూడకుండా 7 సంవస్సరాలు దూరంగా ఉన్నారట.. ఎందకంటే…?

నాగార్జున బిగ్ బాస్ షో నుంచి తప్పుకుంటున్నారా..? దాని వెనుక ఉన్న అసలు వివాదం ఇదేనా..?

 

Visitors Are Also Reading