Home » రామ్ గోపాల్ వర్మ తన కూతురిని చూడకుండా 7 సంవస్సరాలు దూరంగా ఉన్నారట.. ఎందకంటే…?

రామ్ గోపాల్ వర్మ తన కూతురిని చూడకుండా 7 సంవస్సరాలు దూరంగా ఉన్నారట.. ఎందకంటే…?

by AJAY
Ad

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీ లో పరిచయం అక్కర్లేని పేరు. మొదట్లో వర్మ తన సినిమాలతో సంచలనాలు సృష్టించి సంచలన దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. టాలీవుడ్ లో వర్మ తీసిన శివ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అంతే కాకుండా ఆ తరవాత బాలీవుడ్ కు మకాం మార్చిన వర్మ సర్కార్ లాంటి సినిమా తీసి అక్కడ కూడా ట్రెండ్ సెట్ చేశాడు. కొన్ని సూపర్ హిట్ ల తరవాత ఆర్జీవీ కి ఫ్లాప్ లు మొదలయ్యాయి. అయినప్పటికీ రాజకీయ నాయకులు… సినిమావాళ్ల బయోపిక్ లు తీయాలంటే వర్మ తర్వాతే ఎవరైనా. అయితే వర్మ మాత్రం బయోపిక్ లకు పరిమితం కాకుండా ఏ చిన్న కాన్సెప్ట్ దొరికినా దాంతో కథను సిద్ధం చేసుకుని సినిమా చేస్తున్నారు.

Advertisement

 

అంతేకాకుండా తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ లేని సినిమాలు చేసి విడుదల చేస్తున్నారు. దాంతో వర్మ సినిమాలకు ఉండే క్రేజ్ పూర్తిగా పోయింది. కానీ వర్మ ఇంటర్వ్యూ లకు మాత్రం ఎంతో క్రేజ్ ఉంది. ప్రస్తుతం టీవీ ఇంటర్వ్యూలోనే వర్మ ఎక్కువగా కనిపిస్తుంటారు. తనదైన స్టైల్ లో ఫిలాసఫీ చెప్పే వర్మకు ఎంతోమంది అభిమానులు కూడా ఉన్నారు.

Advertisement

అదేవిధంగా అతడిని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే వర్మ తన భార్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కుటుంబంతో ఉండలేమని వర్మ భార్యకు విడాకులు ఇచ్చి సింగిల్ గానే ఉంటున్నాడు. అయితే వర్మకు అప్పటికే ఒక కూతురు కూడా ఉంది. తన కూతురికి ఏడేళ్ళ వయస్సు ఉన్నప్పుడే వర్మ తన భార్యకు విడాకులు ఇచ్చి సింగిల్ గా ఉండటం మొదలుపెట్టాడు. అంతేకాకుండా ఓ ఇంటర్వ్యూలో ఏడేళ్ల పాటు తన కూతురును చూడకుండా ఉన్నానని వర్మ తెలిపాడు. సినిమా లాగే జీవితం కూడా ఒక ఇల్యూషన్ అని వర్మ అన్నాడు.

అందులో తాను నటించలేక పోయాను అని చెప్పాడు. దాంతో భార్య తో విడిపోయినట్టు చెప్పాడు. విడాకుల తర్వాత తన భార్యతో వచ్చిన మనస్పర్థల వల్ల కూతురును ఏడేళ్లపాటు చూడలేదని చెప్పాడు. ఏడేళ్ల తర్వాత కలిసినప్పుడు తాను చాలా చెడ్డవాడిని అని నీకు ఇతరులు ….నా గురించి చెప్పిన దానికంటే చెడ్డవాడిని అని పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. కానీ తాను ఉన్నది ఉన్నట్టుగా చెప్పడంతో తన కూతురు తనకు ఫ్రెండ్ అయిందని వర్మ తెలిపాడు.

Also read : “విక్రమ్” సినిమాలో “టీనా” ఎవరు..? ఇండస్ట్రీలోకి ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

Visitors Are Also Reading