Home » మరోసారి డిఫరెంట్ టైటిల్ తో నాని.. ఈసారి వారాల పేర్లతో..!

మరోసారి డిఫరెంట్ టైటిల్ తో నాని.. ఈసారి వారాల పేర్లతో..!

by Anji
Ad

ప్రస్తుతం సినిమాలకు పేర్లు దొరక్కా ఏవేవో పేర్లు పెట్టేస్తున్నారు. ముఖ్యంగా  అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల.. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. కాదేదీ టైటిల్‌కి అనర్హం అంటున్నారు మన టాలీవుడ్ దర్శకులు. టైటిల్ కొత్తగా ఉన్నపుడే ఆసక్తి కూడా డబుల్ అవుతుంది. ఇప్పుడు ఇదే రూట్ ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే వారాల పేర్లనే సినిమా టైటిల్స్‌గా పెట్టేస్తున్నారు. తాజాగా శనివారాన్ని నాని తీసుకున్నారు. మరి ఇలా వచ్చిన టైటిల్స్ ఏంటో ఓ సారి మనం తెలుసుకుందాం. 

Advertisement

సరిపోదా శనివారం.. టైటిల్ వినడానికి చాలా వినూత్నంగా ఉంది కదా.. ఏదో ఓ రెగ్యులర్ టైటిల్ పెట్టుంటే దీని గురించి అంతగా మాట్లాడుకోడానికి విషయం ఉండేది కాదు. కానీ సరిపోదా శనివారం అంటూ వచ్చేస్తున్నారు నాని. అంటే సుందరానికి తర్వాత మరోసారి డిఫెరెంట్ టైటిల్‌తోనే రాబోతున్నారు వివేక్ ఆత్రేయ. తాజాగా ఈ కాంబినేషన్ షురూ అయింది.. యాక్షన్ థ్రిల్లర్‌గా సరిపోదా శనివారం వచ్చేస్తుంది. వారాలతో సినిమాల టైటిల్స్ రావడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. తాజాగా పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న సినిమాకు మంగళవారం టైటిల్ ఫిక్స్ చేసారు.

Advertisement

ఓ ఊర్లో మంగళవారాలు వరసగా మనుషులు చనిపోతుంటారు. దీని వెనక మిస్టరీనే సినిమా కథ. నవంబర్ 17న మంగళవారం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆసక్తి పెంచేసింది. రెండేళ్ళ కింద తెల్లవారితే గురువారం పేరుతో ఓ సినిమా చేసారు కీరవాణి కొడుకు సింహా. దానికి ముందు ఆదివారం ఆడవాళ్లకు సెలవు అనే సినిమా వచ్చింది. అంతేకాదు.. ఏ వెన్నెస్ డే పేరుతో వచ్చిన నసీరుద్దీన్ షా సినిమా అప్పట్లో సంచలనం. అదే ఈనాడు పేరుతో తెలుగులో రీమేక్ అయింది. శుక్రవారం, సోమవారం పేరుతోనూ సినిమాలు వచ్చాయి. ఇక నెలలే మిగిలి ఉన్నాయి.  వాటిని కూాడా త్వరలోనే  వాడేస్తారేమో మన దర్శకులు.

మరికొన్ని సినిమా వార్తలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Visitors Are Also Reading