Home » నందమూరి మోక్షజ్ఞ స్లిమ్ లుక్.. మామూలుగా లేదుగా..!

నందమూరి మోక్షజ్ఞ స్లిమ్ లుక్.. మామూలుగా లేదుగా..!

by Anji
Ad

 గ్లోబల్ లయన్ నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎగ్జైటెడ్‌గా ఎదురుచూస్తున్నారు. గతంలో అనేకసార్లు అతని డెబ్యూ మూవీ గురించి వార్తలు నెట్టింట స్ప్రెడ్ అయ్యాయి. లాంచింగ్ ప్రాజెక్ట్‌కు పూరీ జగన్నాథ్ వంటి దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. అయితే, పలు ఈవెంట్స్‌లో మోక్షజ్ఞ బొద్దుగా కనిపించడంపై హీరోగా సెట్ అవుతాడా? అనే కామెంట్స్ కూడా నెటిజన్ల నుంచి వ్యక్తమయ్యాయి. పైగా ఇండస్ట్రీలో బాలయ్య లెగసీని కొనసాగించాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం యాక్టింగ్, డాన్స్ తదితర విషయాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు మోక్షజ్ఞ. ఇదే క్రమంలో అతని లేటెస్ట్ స్టిల్స్ చూసి అవాక్కవుతున్నారు నెటిజన్లు. ఊహించని బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో కూడిన తన స్లిమ్ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Advertisement

మోక్షజ్ఞ తన ఫ్రెండ్స్‌తో కనిపించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో  స్లిమ్‌ బాడీతో హ్యాండ్సమ్‌గా కనిపించాడు. ఇక ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్‌కు నందమూరి లెగసీని తను కంటిన్యూ చేయగలడనే నమ్మకమొచ్చేసింది. ఇదిలా ఉంటే.. మోక్షజ్ఞ ఎంట్రీ వచ్చే ఏడాది ఉండబోతుందని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవలే ఫ్రెండ్ బెల్లంకొండ గణేష్.. తన ఫ్రెండ్ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశాడు. ‘నేను స్టూడెంట్ సర్’ ప్రమోషన్స్‌లో భాగంగా.. మోక్షజ్ఞ యాక్టింగ్, డాన్స్ స్కిల్స్‌తో పాటు డైలాగ్ డెలివరీ గురించి గొప్పగా చెప్పాడు. దీంతో అభిమానుల్లోనూ అంచనాలు పెరిగిపోయాయి. 

Advertisement

Manam News

ఇదిలా ఉంటే.. ‘ఆదిత్య 369’ మూవీకి సీక్వెల్‌‌గా ‘ఆదిత్య 999’ తెరకెక్కిస్తానని బాలయ్య ఇదివరకే ప్రకటించారు. నిజానికి ఈ మూవీకి లెజెండరీ ఫిల్మ్ మేకర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తారని అనుకున్నా.. దీనిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మాత్రం జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీలో తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి నటించే అవకాశం ఉందని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అధికారిక ప్రకటన వస్తే తప్ప అసలు విషయం తెలియదు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

“భగవంత్ కేసరి” టీజర్…ఈ పేరు చానా ఏళ్లు యాదుంటది…!

మీకు సిగరేట్ అలవాటు ఉందా ? క్యాన్సర్ తో పాటు మరో ప్రమాదం కూడా.. జాగ్రత్త..!

మీరు వర్కౌట్లు చేస్తున్నారా.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. గుండెపోటు వచ్చే అవకాశం

Visitors Are Also Reading