Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » “భగవంత్ కేసరి” టీజర్…ఈ పేరు చానా ఏళ్లు యాదుంటది…!

“భగవంత్ కేసరి” టీజర్…ఈ పేరు చానా ఏళ్లు యాదుంటది…!

by AJAY
Ads

నట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ యాక్షన్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సాహూ గారపాటి హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా నేడు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను చిత్ర‌యూనిట్ విడుదల చేసింది.

Advertisement

Ad

ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. టీజర్ లో తెలంగాణ యాసలో బాలయ్య అదరగొట్టారు. అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి అంటూ మాస్ డైలాగ్ చెప్పారు. ఈ పేరు చానా ఏళ్లు యాది ఉంటది అంటూ బాలయ్య మరో డైలాగుతో ఆకట్టుకున్నారు. బాలకృష్ణ మొదటి సారి తెలంగాణ యాసలో మాట్లాడటంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా బాలయ్యకు కూతురుగా స్టార్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది.

Advertisement

ఈ సినిమా కథ తండ్రీ కూతుళ్ల‌ అనుబంధం నేపథ్యంలో కొనసాగనుంది. అదేవిధంగా శ్రీలీల‌ పాత్రకు కూడా ఈ సినిమాలో ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఇక భారీ అంచనాల మధ్య తెరకెక్కిన భగవంత్ కేసరి ఈ ఏడాది దసరాకు విడుదల కాబోతుంది. సాధారణంగా తెలంగాణలో దసరాను పెద్ద పండుగలా సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి చిత్ర యూనిట్ సినిమాను దసరాకు విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మ‌రోవైపు ద‌స‌రాకు మ‌రికొన్ని స్టార్ హీరోల సినిమాలు కూడా విడుద‌ల‌కు సిద్దంగా ఉంటాయి.

Visitors Are Also Reading