Home » మీకు సిగరేట్ అలవాటు ఉందా ? క్యాన్సర్ తో పాటు మరో ప్రమాదం కూడా.. జాగ్రత్త..!

మీకు సిగరేట్ అలవాటు ఉందా ? క్యాన్సర్ తో పాటు మరో ప్రమాదం కూడా.. జాగ్రత్త..!

by Anji
Ad

సాధారణంగా ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని సిగరేట్ డబ్బాలపై.. మద్యపానం హానికరం అని మద్యం సీసాలపై రాసి ఉండటం మనం చూస్తుంటాం. కానీ వాటినే అధికంగా తీసుకుంటారు. ముఖ్యంగా స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్.. స్మోకింగ్ కిల్స్ అంటూ సినిమా థియేటర్లలో కూడా చూస్తుంటారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా చూస్తుంటాం.ఇష్టారీతిన సిగరెట్లు మీద సిగరెట్లు తాగుతూ పోతే చివరికి ప్రాణాలు పోయే ఆస్కారం కూడా ఉంది.  ఇప్పుడు క్యాన్సర్ మాత్రమే కాదు.. కొత్తగా గుండె  పోటు కూడా జాబితాలోకి చేరింది. అంటే స్మోక్ చేస్తున్న వాళ్లే త్వరగా గుండెపోటుకు గురవుతున్నారు. ఆ విషయం మేము చెప్పడం లేదు. స్వయంగా వైద్యులే హెచ్చరిస్తున్నారు. 

Advertisement

 స్మోకింగ్ వల్ల తీరని అనారోగ్యానికి గురవుతారనే విషయం తాగని వాళ్ల కంటే.. తాగే వాళ్లకే బాగా తెలుసు. వాళ్లు తాగే ఒక్కో సిగరెట్ వారిని తమకు కావాల్సిన వారికి ఎంత దూరం చేస్తుందో ఇంకా బాగా తెలుసు. కానీ, కొందరు మొండిగా.. నాకేం అవుతుందిలే అని సిగిరెట్లు తాగేస్తున్నారు. ఈ మధ్య గుండెపోట్లు పెరిగిన విషయం తెలిసిందే. చాలామంది టీకాలు వేయించుకున్నందుకు గుండెపోట్లు వస్తున్నాయని భావిస్తున్నారు. అయితే వైద్యులు ఆ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. టీకా ప్రభావం కేవలం 6 నెలల వరకే ఉంటుందని చెబుతున్నారు. వారికి ఉండే చెడు అలవాట్ల వల్లే గుండెపోట్లు వస్తున్నాయని స్పష్టం చేశారు. చెడు అలవాట్లు అంటే ముఖ్యంగా స్మోకింగ్, మద్యం సేవించడం, ఇంకా కొందరు రెండు అడుగులు ముందుకేసి గంజాయి, మాదకద్రవ్యాలు వంటివి తీసుకుంటున్నారు. ఈ అలవాట్లే వారిని కుంటుబానికి దూరంగా, చావుకి దగ్గరగా చేస్తోంది.

Advertisement

ఒకానొక సమయంలో అన్నీ మానేయాలని బాడీ చెప్తుంది. అప్పుడు మీరు వింటే అంతా ఆనందంగా ఉంటుంది. కానీ, అప్పుడు మీరు పెడచెవిన పెడితే మీ మరణశాసనాన్ని మీ చేతులారా మీరే సిగిరెట్ పీకలతో రాసుకున్నవాళ్లు అవుతారు. మీరు సిగిరెట్లు మానేయాలి అనుకుంటే మాత్రం ఇదే మంచి తరుణం. ఎందుకంటే భయం మిమ్మల్ని ఆ అలవాటుకు కచ్చితంగా దూరం చేయగలదు.అంతేకాకుండా ప్రస్తుతం ఎండలు పెరుగుతున్నాయి. ఈ ఎండాకాలంలో ఎంత పెద్ద చైన్ స్మోకర్ అయినా కూడా సిగిరెట్లు తగ్గిచ్చేస్తాడు. ఇలాంటి సమయంలో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుని సిగిరెట్లు తాగడాన్ని మానేయగలిగితే మీకంటే అదృష్టవంతులు ఎవరూ ఉండరరు. ఒకటి గుర్తుపెట్టుకోండి సిగిరెట్ కాలిపోతు మీ జీవితాన్ని కాల్చేస్తుంది. మీ ఆధారపడే వాళ్లని, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్లని నట్టేట ముంచుతుంది. అందుకే వెంటనే సిగిరెట్లు తాగడం మానేయండి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

చిన్న వయస్సులో స్మార్ట్ ఫోన్ వినియోగిస్తే అంత ప్రమాదమా..? నిపుణులు ఏమంటున్నారంటే ?

 వేసవిలో మీ ఆరోగ్యాన్ని పెంచే ఇంట్లో తయారు చేసుకునే కూల్ డ్రింక్స్ ఇవే..!

వీటిని మాత్రం ప్రిడ్జ్ లో అస్సలు పెట్టకండి.. విషం కంటే ప్రమాదం..!

Visitors Are Also Reading