Home » తన సినిమాకు పోటీ ఇచ్చిన డైరెక్టర్ తో నాగ్..!

తన సినిమాకు పోటీ ఇచ్చిన డైరెక్టర్ తో నాగ్..!

by Azhar
Ad

టాలీవుడ్ సీనియర్ హీరో అయిన నాగార్జున తాజాగా ది ఘోస్ట్ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. కానీ విడుదలకు ముందు అంచనాలు ఉన్న ఈ సినిమా రిలీజ్ తర్వాత.. ఆ రేంజ్ లో కలెక్షన్స్ అనేవి తెచుకోలేకపోయింది. హిట్ అనుకున్నది.. యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. అయితే ఈ సినిమాకు పోటీగా.. ది ఘోస్ట్ రిలీజ్ రోజు మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాధర్ సినిమా కూడా విడుదల అయ్యింది.

Advertisement

అయితే ఈ సినిమా అనేది విడుదలకు ముందు ప్లాప్ అనుకున్నా.. తర్వాత టాక్ అనేది మారిపోయింది. ఈ సినిమా మంచి హిట్ అందుకొని.. 100 కోట్లు కూడా కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు నాగార్జున తన సినిమాకు పోటీగా సినిమాను తెచ్చిన మోహన్ రాజాకు అవకాశం అనేది ఇవ్వనున్నాడు అని తెలుస్తుంది.

Advertisement

ది ఘోస్ట్ సినిమా గనుక హిట్ అయితే.. మళ్ళీ ఈ సినిమా డైరెక్టర్ అయిన ప్రవీణ్ సత్తార్ తో ఇదే సినిమా సీక్వెల్ అనేది తీయాలని నాగ్ అనుకున్నాడు. కానీ ది ఘోస్ట్ సినిమా టాక్ తో ఆ ఆలోచన మానుకున్నాడు. అందుకే మెగాస్టార్ కు హిట్ ఇచ్చిన.. డైరెక్టర్ తో ఇప్పుడు సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడు. చూడాలి మరి చిరుకి హిట్ ఇచ్చిన రాజా… నాగ్ కూడా హిట్ ఇస్తాడా అనేది.

ఇవి కూడా చదవండి :

పదవి పోవడంపై గంగూలీ రియాక్షన్ ఇలా..?

ఇండియా ఫ్యాన్స్ మంచోళ్ళు అంటూ సొంత ఫ్యాన్స్ కు పాక్ విమర్శలు..!

Visitors Are Also Reading