Home » వెంకటేష్ రిజెక్ట్ చేసిన కథతో హిట్ కొట్టిన నాగార్జున.. ఆ సినిమా ఏదంటే?

వెంకటేష్ రిజెక్ట్ చేసిన కథతో హిట్ కొట్టిన నాగార్జున.. ఆ సినిమా ఏదంటే?

by Bunty
Ad

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేసి హిట్టు కొట్టడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా హీరోలు వదిలేసుకున్న సినిమాలు మరో హీరో చేసి సూపర్ హిట్ కొడితే ఇక అదే కథను వదిలేసుకున్న హీరోలు బాధపడటం కూడా జరుగుతూ ఉంటుంది. కాగా, ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న వెంకటేష్ విషయంలో కూడా ఇలాంటిదే జరిగిందట.

Advertisement

నాగార్జున కెరియర్ లో సూపర్ హిట్ మూవీగా ఉన్న సంతోషం సినిమా కథ కూడా ముందుగా వెంకీ దగ్గరికి వచ్చిందట.కానీ, వెంకటేష్ అప్పటికే అలాంటి స్టోరీలు చేయడంతో నో చెప్పాడట. కానీ నాగార్జున ఆ సినిమా చేసి హిట్టు కొట్టాడు. ఇవి మాత్రమే కాకుండా గోవిందుడు అందరివాడేలే, క్రాక్ సినిమాలను కూడా వదులుకున్నాడట వెంకటేష్. కాగా, అక్కినేని నాగార్జున, గ్రేసి సింగ్, శ్రియా శరన్ ప్రధాన పాత్రలలో నటించిన సంతోషం సినిమా 2002లో విడుదలైన సూపర్ హిట్ గా నిలిచింది.

Advertisement

ఇందులో డైరెక్టర్ కె. విశ్వనాథ్, ప్రభుదేవా కీలక పాత్రలలో నటించారు. సంతోషం సినిమా ద్వారా దశరథ్ అనే ఓ కొత్త దర్శకుడిని ఇండస్ట్రీలో పరిచయం చేశారు నాగ్. ఏకంగా అతని కోసం ఓ ఎనిమిది నెలల పాటు మేకప్ వేసుకోకుండా ఉన్నారు. నాగార్జున దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కే.ఎల్.నారాయణ నిర్మించిన ఈ సినిమా 2002 మే 9న విడుదలై ఘనవిజయం సాధించింది.

READ ALSO : MS Dhoni : లవ్ టుడే హీరోయిన్‌తో ధోని మొదటి సినిమా..

Visitors Are Also Reading