Home » హీరోగా ఇండ‌స్ట్రీ హిట్ సినిమాను మిస్ చేసుకున్న నాగ‌బాబు..? ఆ సినిమా ఏదంటే..?

హీరోగా ఇండ‌స్ట్రీ హిట్ సినిమాను మిస్ చేసుకున్న నాగ‌బాబు..? ఆ సినిమా ఏదంటే..?

by AJAY
Ad

కొంత‌మందికి ఎంతో టాలెంట్ ఉన్నా స‌రైన స‌పోర్ట్ లేక‌పోవ‌డం వల్ల ఇండ‌స్ట్రీలో రానించ‌లేరు. ఇక మ‌రికొంత‌మంది ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్నా టాలెంట్ ను చూపించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నో త‌ప్ప‌ట‌డుగులు వేయ‌డం వ‌ల్ల‌నో ఇండ‌స్ట్రీలో రానించ‌లేరు. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఆ రెండో కోవ‌కు చెందిన వారు. చిరంజీవి తమ్ముడుగా నాగ‌బాబు సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు.

Advertisement

హీరోగా విల‌న్ గా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా నాగబాబు సినిమాలు చేశాడు. అంతే కాకుండా నిర్మాత‌గా మారి ఏకంగా సినిమాల‌ను నిర్మించారు. ఇక న‌టుడుగా నాగ‌బాబు స‌క్సెస్ అవ్వ‌లేపోయారు. అంతే కాకుండా నిర్మాత‌గా చేయ‌డం ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వ‌డంతో దారుణంగా న‌ష్ట‌పోయారు. చివ‌ర‌కు అప్పుల పాలు కూడా అవ్వాల్సి వ‌చ్చింది.

Advertisement

అయితే నిజానికి నాగబాబు త‌న కెరీర్ లో ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాను మిస్ చేసుకున్నారు. ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. చిరంజీవి హీరోగా న‌టించిన గ్యాంగ్ లీడ‌ర్ సినిమా ఎంత‌టి విజ‌యం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ హిట్ గా నిల‌వ‌డంతో పాటూ చిరుకు ఎంతో క్రేజ్ ను తీసుకువ‌చ్చిపెట్టింది.

మాస్ ఆడియ‌న్స్ కు ఈ సినిమా తెగ‌న‌చ్చేసింది. అయితే ఈ సినిమాకు మొద‌ట నాగ‌బాబును హీరోగా అనుకున్నారు. కానీ ఆ త‌ర‌వాత కొన్ని కార‌ణాల వ‌ల్ల చిరంజీవిని హీరోగా తీసుకున్నారు. ఈ సినిమాకు విజ‌య్ బాపినీడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మాస్ ఎంట‌ర్టైన‌ర్ గా వ‌చ్చిన ఈ సినిమా ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక మొద‌ట అనుకున్న‌ట్టుగా నాగ‌బాబు ఈ సినిమాలో న‌టించి ఉంటే ఆయ‌నే స్టార్ అయ్యి ఉండేవారేమో.

ALSO READ : పుష్ప 2లో జగపతిబాబు నటించే పాత్ర అదేనా ? 

Visitors Are Also Reading