Home » పవన్ పై పోటీకి సిద్ధమన్న ఆలీ.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు

పవన్ పై పోటీకి సిద్ధమన్న ఆలీ.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు

by Bunty
Published: Last Updated on
Ad

జనసేన అధినేత హీరో పవన్ కళ్యాణ్, ఆలీకి సన్నిహితులు అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ సినిమాలో కచ్చితంగా ఆలీ ఉండాల్సిందే. ఇక తాజాగా ఆలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధిష్టానం ఆదేశిస్తే, తాను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై సైతం పోటీకి సిద్ధమని ప్రకటించారు.

Advertisement

 

అంతేకాకుండా రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం సాధారణమని చెప్పారు. దాంతో ప్రస్తుతం ఆలీ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. అయితే కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న నాగబాబు పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన పొత్తులు ఎవరితో అనేది తమ పార్టీ అధ్యక్షుడు ప్రకటిస్తారని, పొత్తు ఫైనల్ అవ్వాలి ఆ తర్వాత, ఎవరు ఎక్కడ పోటీచేయాలో నిర్ణయం ఉంటుంది అన్నారు.

Advertisement

ఏపీలో పాలన చెత్తగా ఉందని నాలుగేళ్లుగా అరాచకం, రౌడీ రాజ్యం, గంజాయి రాష్ట్రంగా మారిపోయింది అన్నారు. శ్రీకాకుళంలో జరిగిన యువశక్తి కార్యక్రమంతో రాష్ట్రంలో జనసేన నాయకులపై వైయస్సార్సీపి కన్నేసి ఉంచారని, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై జన సైనికులతో చర్చిస్తున్నట్లు వివరించారు. ఇక పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధమన్న ఆలీ వ్యాఖ్యలపై నో కామెంట్స్ అన్నారు. పొత్తుల విషయంలో ఎలాంటి విధానంతో ముందుకు వెళ్తున్నాం అనే విషయాన్ని పవన్ చూసుకుంటారన్నారు.

READ ALSO : Singer Mangli: సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి.. కారణం అదే!

Visitors Are Also Reading